2007-09-27

నేను రాసిన కధ-1

శాంతి--ది డేంజెర్



అది ఒక విశ్వవిద్యాలయపు పరిశోదనా కేంద్రము.

విక్కి మరియు అతని సహచరులు పింకీ,జాన్,సున్ని లకి అది చాలా కీలకమైన రోజు.

ఈ రోజే వాళ్ళు కొన్ని సంవత్సరలుగ వేచి చూస్తున్న రోజు.

విక్కి వాళ్ళ ప్రొజెక్ట్ లో చాలా కీలకమైన వస్తువు ని పరీక్షించల్సిన రోజు అందరి మొహాల లోను ఆందొళన కొట్టొచ్చినట్లు కనిపిస్తొంది. ఓక్క సారి విక్కి తన ప్రొజెక్ట్ ప్రారంభించిన రొజులని గుర్తు తెచ్చుకున్నాడు. తను ఈ ప్రొజెక్ట్ మొదలుపెట్టినప్పుడు తనని చూసి నవ్విన తన స్నేహితులు,ఉపాధ్యయులు ఇంకా అవమనాలు అన్ని గుర్తుకి వచ్చాయి.

వాళ్ళకి సమాదానంగా విక్కి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి

"మనిషి తన తెలివితో ఒక ఇనుప ఆకారాన్ని మనిషి లాగ ప్రవర్తింపచెయగలిగినప్పుడు అదె మనిషి ప్రాణమున్న మనిషి లాగ బ్రతకలేని మానసిక వికలాంగులని ఎందుకు మామూలు మనిషి గ చెయలేడు?"

ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికే తన ఈ ప్రయత్నం దానికి ముద్దుగ తను పెట్టుకున్న పేరే "శాంతి". ఏందరో మనసిక వికలాంగుల జీవితాలలో శాంతిని నింపాలానదే తన ప్రయత్నం

ఈ ప్రయత్నంలో తనకి తోడుగా ఇంకో ముగ్గురుకావాలి తనకి వాళ్ళని పోగుచేయటానికి మూడు నెలలు పట్టింది. ఏవరికి తన ఆలోచన చెప్పినా వల్లు నవ్వుతున్నారేగాని తన ప్రొజెక్ట్ లొ పని చెయటానికి ఒప్పుకోవట్లెదు...

2007-08-31

సామెతలు-2

అంగట్లో అన్ని వున్నా అల్లుడి నోట్లొ శని వున్నట్లు

కుక్క కాటుకి చెప్పు దెబ్బ ( చాలా ప్రసిద్ధిగాంచిన సామెత)

శుభమా అని పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికూతురు ముండ ఏది అన్నాడు అంట ఒకడు

2007-08-04

తెలుగు సామెతలు

నా మొదటి సామెత

నేను సామెతలు రాస్తాను అని చదివిన వెంటనే మీ మదిలొ మెదిలె

" యెంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది"
" ఇల్లు అలకగానే పండగ అవ్వదు"
" అమ్మ పెట్టాపెట్టదు అడుక్కు తినానివ్వదు"

2007-07-28

త్వరలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నవి

కొంచెం గుండెదిటువు చేసుకొని చూడమని విజ్ఞప్తి.....

--> నేను రాసిన మొదటి కధ
సినిమా తీయాలని ఒక ఆలోచన

--> నేను రాయబోతున్న కవితలు
ఇప్పటివరకైతే ఒక్కటి కూడా రాయలేదు. మీ మీదే ప్రయొగం చేయబోతున్న
--> నాకు నచ్చిన చిత్రపటాలు
అదేనండి వాలు పేపరులు
--> నాకు నచ్చిన సినిమాలు
ఎక్కువ లేవులేండి
--> నేను తీసిన చిత్రపటాలు
--> చివరిగ నాకు అప్పుడప్పుడు తెలిసే చిన్నాచితక చిట్కాలు

2007-07-27

నా గొడవ

నా గురించి చెప్పాలంటే చాలానే చెప్పొచు కాని నాకు సొంత డబ్బా ఇష్టం లేదు కాబట్టి కొంచెం చెప్తా

నా పేరు : ఫణి కుమార్

నేను చదివింది: బి.టెక్

చేసెది : ఒక software కంపెని లో ఊడిగం

నా తీరిక సమయాలలో నేను చెసే పనులు: కధలు అల్లడం,ప్రోగ్రాములు చెయడం
(అదెనండి చాలా మంది హొబీస్ అంటారు)

తెలుగులో రాయడం ఏలా?

మీరు తెలుగులో రాయడానికి వీవెన్‌ వారు చక్కని సైట్ ని మనకి అందించారు దాని పేరే http:\\lekhini.org