2019-10-21

నా ఆలోచన: వార్తలు

లీలగా జరిగినది లాగి చెప్తాను
గోలలో గుర్తున్నది గోరింతలు చేసి చెప్తాను 
నేరుగా చూసింది నరికి నాకు నచ్చింది చెప్తాను 
బేజారు అయ్యేదాకా బెంబేలు  ఎత్తేదాకా అదే అదే చెప్తాను 

అన్నట్టు ఉన్నది ఇప్పటి ఛానెళ్ల పరిస్థితి 


dengue  జ్వరాలు వచ్చి పిల్లలు పెద్దలు న్యాయమూర్తులు చనిపోతుంటే ఇదేంటి ప్రభుత్వం ఏమి చేస్తోంది అని నిలతీసే ధైర్యం లేని పత్రిక లలిత జెవెల్లెర్స్  దొంగ రెక్కీ ఎలా చేసాడు అన్నది ముఖ్యం అనుకున్నది. ఆ వివరాలు ఎందుకు ఎవరికీ ఉపయోగపడతాయి అని చూపిస్తున్నారు?


ఈనాడు 21 Oct  2019  3:17 PM





















బ్రతుకు భయం గుండె ఆగిన ఒక కార్మికుడి కష్టం కన్నా ఒక నటీమణి నిర్మాత మీద అలిగిందా లేదా అన్నది ముఖ్యమనుకున్న  మరో పత్రిక 


సాక్షి 21 Oct  2019 3:22 PM 
ఆంధ్రజ్యోతి 21 oct 2019 3:37 PM 





















నెల క్రితం బోటు ఎందుకు మునిగింది దాని వెనక శివుడున్నాడా లేదా అన్నది జనాలని ఇబ్బంది పెడుతున్న సమ్మె కన్నా ముఖ్యమన్న పత్రిక ఇంకొకటి


అసలు ఒక్కటన్నా నిజంగా జనాల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తోందా? రోజు ఉద్యోగం కి వెళ్లే వాడికి బస్సులు  ఆటోలు తిరగటం కావాలి కానీ గతాలు దొంగతనాలు ఎందుకు చెప్పండి 

పత్రిక విలువల మీద నేను పెద్దగా మాట్లాడే అర్హత నాకు లేదు కానీ ఒక పత్రిక చదువుతున్న పాఠకుడిగా నా రోజు నాకు కావాల్సిన అంశాలతో మొదలవ్వాలి అని ఉంటుందిగా. కాళేశ్వరం లింక్ చేస్తున్నారు హైదరాబాద్ లో మూడు రోజులు నీళ్లు రావు అని చెప్పిన పత్రికలూ ఆ తర్వాత నాలుగవ రోజు కూడా నీరు రాలేదు కొన్ని ప్రాంతాలకి అన్నది ఎంతవరకు జనాలలోకి తీసుకెళ్లింది. 

రాష్ట్రమంతా డెంగీ వ్యాధి సోకి జనాలు చనిపోతుంటే దానిమీద ముందు పేజీ లో ప్రశ్నించటం ఆపి ఒక్క హుజుర్ నగర్ ఎన్నికకి ప్రాముఖ్యత ని ఇవ్వటం సబబా??? ఎప్పుడో వారం క్రితమే మేము డెంగీ గురించి చెప్పం అనచ్చేమో  కానీ చెప్పిన తరువాత  పరిస్థితులు మారాయా? మారకపోతే మార్చే బాధ్యత  నాయకుల మెడలు వంచే భాద్యత మీడియాకి లేదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పత్రికని నమ్మలేని స్థితిలో జనం నమ్మకం గెలుచుకోలేని దయనీయమైన స్థితిలో పత్రికలూ వున్నాయి అని నాకు అనిపిస్తోంది మరి మీకు?


-మీ నేస్తం 

2 comments:

  1. యధా ప్రజా..తథా రాజా...
    ఆంద్రప్రదేశ్ లో మీడియా పై విధించిన నిషేధాన్ని ప్రస్తావిస్తే బాగుండేది.

    సాక్షి లాంటి పార్టీ పత్రికలు వచ్చాక...మిగతా పత్రికలు కూడా పార్టీ పత్రికలు అయ్యాయి.

    ReplyDelete
  2. ఒక్కో పాఠకుడికి ఒక్కో రుచి. ఎవరికిష్టమైన వార్తలు వాళ్ళు చదువుకుంటారు.
    అబద్ధాలని, "అట" కబుర్లని ఏకి పారేయ్యడానికి బ్లాగులు ఎలాగూ ఉన్నాయి.

    ReplyDelete