2010-03-01

నా ఆటను చేడకోడుతూ వచ్చింది అది/ఆడు

ఒకానొక వాన కురిసిన రాత్రి వేడిగా పకోడీలు తింటూ కమ్మగా పాత పాటలు వింటూ నేను కంప్యుటరులో జి టి ఎ ఆడుతుండగా మా రూములో ఏదో చప్పుడు అయ్యింది. అసలే రూములో పని పాడు లేకుండా ఖాళీగా ఉండేవాడిని నేనే కాబట్టి ఆడుతున్న ఆటని మధ్యలో ఆపి ఏంటా అని రూములో వెతకటానికి పోయాను. అన్ని చోట్ల వెతికాక ఏమి కనిపించక పోయే సరికి ఇది వాడి/దాని  పనే అయ్యుంటుంది అని నిర్ణయించేసుకొని మళ్ళి నా చుట్టుపక్కల నిశితంగా వెతకటం మొదలుపెట్టాను.

అలా వాడు/దాని కోసం ఏంటో వెతకగా అలిసి సొలసి ఇంకా వెతక లేక హాలులో మంచం మీద కూలపడిపోయాను. వాడిని/దానిని చంపేయాలి కాని ఎలాగా అని ఆలోచిస్తుండగా. మళ్ళి దాని/వాడి అరుపు నాకు చాలా దగ్గరలో వినిపించింది. ఆ అరుపుకి మళ్ళి నా వెతుకులాట మొదలుపెట్టి.సరిగ్గా నేను కూర్చున్న మంచం  కింద పెట్టిన బూట్లలోనుంచి మళ్ళి అరుపు వచ్చింది. ఈ సారి నా కోపం బి పి మీటరుకి కూడా దొరకకుండా పెరిగిపోయింది. వెంటనే దానిని చంపటానికి కర్రతీసుకువచ్చాను.

నేను కర్ర తీసుకొని సిక్స్ కొట్టే  సచినులాగా గోలు కొట్టే ధనరాజ్ పిళ్ళై లాగా రెడీ అయ్యి బూటుని కర్రతో కొంచెం కదిపాను. ఆ కుదుపుకి మెల్లమెల్లగా బయటకి వచ్చింది/వచ్చాడు. "మియ్య్యావ్వ్వ్ మియ్యావ్వ్వ్" అని అరుచుకుంటూ ఈ మధ్యనే మా వీధిపిల్లికి పుట్టిన పిల్లిపిల్ల. మూసినా కళ్ళని నెమ్మదిగా చిట్లిస్తూ తెరుస్తోంది. దానిని అలా చూసేసరికి నా చంపాలన్న కోరికని చచ్చిపోయింది. వెంటనే దగ్గరకి తీసుకోవాలి అనిపించింది కాని మళ్ళి ఇల్లుఅలవాటు అయితే ఇబ్బంది అని భయం వేసి దానిని నెమ్మదిగా తరిమేసాను.


గమనిక: ఆ పిల్లి పిల్ల ఆడదో మగదో తెలియక అది/ఆడు అని వాడాను. మీకు నచ్చిన జాతికి చెందినదిగా భావించి  చదవగలరు  

4 comments:

  1. జంతువు ఆడయినా ,మగైనా 'అదే'

    ReplyDelete
  2. కమల్ గారు అలాగే రాద్దాము అనికున్నాను అండి కాని ఏదో కొంచెం సస్పెన్స్ ఉంటుంది కదా అది/ఆడు అని రాస్తే అనిపించింది అందుకే అలాగన్నమాట.

    ReplyDelete
  3. pilli ni evarayina champalani anukunrata andi..?

    ReplyDelete
  4. కామెంటినందుకు ధన్యవాదములు జాబిల్లిగారు...
    ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి జవాదు చెప్పాలి అంటే నేను ఒక పెద్ద తపానే పెట్టాలి "నా పిల్ల(ల్లి) కష్టాలు" అని. సమయం దొరికితే త్వరలోనే రాస్తాను అప్పుడు మీరే న్యాయం చెబుదురుగాని

    ReplyDelete