2010-10-26

కవిత: ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే

మొదటి సారి గగన ప్రయాణం చేస్తున్న ఒక వ్యోమగామి అంతరిక్షంలోనించి భూమిని చూస్తూ.....

కనుబొమ్మల ముందు కనపడు గోళమున
కనువిందు చేయు పచ్చిక కాన రాగ
కన్నులముందర గ్రహాలూ బంతులు కాగా 
ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే!


కాంతులీను తారల నడుమ మనసు మోహనరాగమాలపించగా
కనురెప్పలు గ్రహగతులకు తాళము వేయగా
తేలియాడు శరీరము తాళమునకు నాట్యమాడగా
కనుమరుగవుతున్న ధరణి కాంతులాతని కన్నుల గాంచె!!

రెండవ కవితకి ఆలోచన మరియు సహకారం అందించిన శాంతి కి ధన్యవాదములు

3 comments:

  1. భువి అందు - మలయ మారుతములు, పక్షుల కిలకిలా రావములు, జలపాతపు హొయలు, చల్లని గాలుల చిరు సవ్వడులు, అడవి తల్లి లాలనలు, ప్రక్రుతి పులకరింతలు, మనుషుల మారనహొమాలు,నదీజలాల కేరింతలు ను గాంచ దలచి ఆ సాఫ్ట్ వేర్ నరుడు సెలవును వొసొంగ మని కోరి విఫలుడు అయినందున ఆ నరుడు ఈ ధరణీ సొగసులను వీక్షించుటకు వ్యొమగామి రూపమున భువిని వీడి గగనానికి ఏగి అచ్చట ధరణీ అందములను ఆస్వాదించిన ఆ నయనములు ఎంతటి అద్రుష్టం చేసుకొనెను :-)

    ReplyDelete
  2. ఆ అదృష్టం మనలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఏంటో ప్చ్:(:(:(

    ReplyDelete
  3. chala talent undi mee friend cirvle looo

    ReplyDelete