శాంతి--ది డేంజెర్
అది ఒక విశ్వవిద్యాలయపు పరిశోదనా కేంద్రము.
విక్కి మరియు అతని సహచరులు పింకీ,జాన్,సున్ని లకి అది చాలా కీలకమైన రోజు.
ఈ రోజే వాళ్ళు కొన్ని సంవత్సరలుగ వేచి చూస్తున్న రోజు.
విక్కి వాళ్ళ ప్రొజెక్ట్ లో చాలా కీలకమైన వస్తువు ని పరీక్షించల్సిన రోజు అందరి మొహాల లోను ఆందొళన కొట్టొచ్చినట్లు కనిపిస్తొంది. ఓక్క సారి విక్కి తన ప్రొజెక్ట్ ప్రారంభించిన రొజులని గుర్తు తెచ్చుకున్నాడు. తను ఈ ప్రొజెక్ట్ మొదలుపెట్టినప్పుడు తనని చూసి నవ్విన తన స్నేహితులు,ఉపాధ్యయులు ఇంకా అవమనాలు అన్ని గుర్తుకి వచ్చాయి.
వాళ్ళకి సమాదానంగా విక్కి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి
"మనిషి తన తెలివితో ఒక ఇనుప ఆకారాన్ని మనిషి లాగ ప్రవర్తింపచెయగలిగినప్పుడు అదె మనిషి ప్రాణమున్న మనిషి లాగ బ్రతకలేని మానసిక వికలాంగులని ఎందుకు మామూలు మనిషి గ చెయలేడు?"
ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికే తన ఈ ప్రయత్నం దానికి ముద్దుగ తను పెట్టుకున్న పేరే "శాంతి". ఏందరో మనసిక వికలాంగుల జీవితాలలో శాంతిని నింపాలానదే తన ప్రయత్నం
ఈ ప్రయత్నంలో తనకి తోడుగా ఇంకో ముగ్గురుకావాలి తనకి వాళ్ళని పోగుచేయటానికి మూడు నెలలు పట్టింది. ఏవరికి తన ఆలోచన చెప్పినా వల్లు నవ్వుతున్నారేగాని తన ప్రొజెక్ట్ లొ పని చెయటానికి ఒప్పుకోవట్లెదు...