Showing posts with label హాస్యం. Show all posts
Showing posts with label హాస్యం. Show all posts

2016-11-16

కధ: చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ - మొదటి భాగం

"హాయ్!! హలో !! నమస్తే!! ఆదాబ్ !! వేల్కం టు చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ ...................
దీనిని మీకు అందిస్తున్న వారు స్కూటర్ అగర్బత్తి మరియు రావణరాజ్ అడ్డకట్టు పంచలు.

మీరందరు మెచ్చిన అండ్ మీకు నచ్చిన చెంపచెళ్లుమంది పది వేల  ఎపిసోడ్ సందర్భంగా మీకోసం ఈ సక్సెస్ మీట్. "

అంటూ గుక్కతుప్పుకోకుండా గాలి పీల్చకుండా ...తాను బట్టల్లో చేసిన పొదుపు మాటల్లో ఏ మాత్రం చేయకుండా మాట్లాడుతున్న యాంకరమ్మ రావమ్మని ఆపమని కెమరామెన్ సంజ్ఞ చేసి పూర్తి బట్టలు వేసుకున్న మగ యాంకర్ పరాదీపుని రమ్మన్నాడు.

"చాలా బాగా మాట్లాడవు రావమ్మా కానీ నాకు పేమెంట్ ఇస్తున్నారు నన్ను మాట్లాడనివ్వు అని" గుసగుసగా మాట్లాడి గుట్టు చప్పుడు కాకుండా రావమ్మకి వార్నింగ్  పరాదీపు నవ్వుతు కెమెరా ముందుకు వచ్చి.

"సూపర్!!! ఇంకా మనం కార్యక్రమం మొదలు పెడదాం! ముందుగా ఈ సీరియల్ లో ప్రతి ఎపిసోడ్ క్రమం తప్పకుండ చెంపచెళ్లుమనిపించుకున్న మన నాయకి "ఏడుపు ఎంకమ్మ"ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం"

"ఏడుపు ఎంకమ్మ" యాంకరమ్మ కురచగా కుట్టించుకోగా మిగిలిన గుడ్దని కూడా తన గౌనుకి కొట్టుకొని మెట్లు ఎక్కటానికి ఆపసోపాలు పడుతూ పైకి వస్తోంటే మన పరాదీప్ పరుగుల మీద వెళ్లి చేయందించి వేదిక మీదకి తెచ్చాడు.

రావమ్మా: "చెప్పండి ఎంకమ్మ గారు అసలు అన్ని చెంపదెబ్బలు తిన్నాక మీ అనుభూతి చెప్పండి"

ఎంకమ్మ: "ముందుగా ఈ సీరియల్ నాకు ఇచ్చిన డైరెక్టర్ జిగురు బాబ్జికి ప్రొడ్యూసర్ పిసినారి పాపికి నా ధన్యవాదాలు. బాబ్జిగారు నాకు ముందే చెప్పారు ఈ సీరియల్ తర్వాత మీరు పెద్ద స్టార్ అవుతారు అని అలాగే ఇప్పుడు ఎక్కడ ఏ ఏడుపుగొట్టు పాత్ర వున్నా మొదట నా దెగ్గరకు వస్తూన్నారు... ఈ మధ్యన మా అయన కూడా ఈ సీరియల్ పుణ్యమా అని కనీసం నీ బుగ్గల వాపుని కండ అనుకోని కొంతమంది నన్ను "మీ ఆవిడకి తిండిపెట్టటం లేదా అని " అడగటం లేదు సంతోషం అంటున్నారు . చాలా ఆనందంగా ఉంది ఇంట్లోవాళ్ళు అంతలా నన్ను మెచ్చుకుంటే. ఈ సీరియల్ తర్వాత నా తెలుగు చాలా బాగయింది. ఇంకా సెలవు . గాడ్ బ్లెస్స్ యు అల్ "

పరాదీప్: "సూపర్!! మరి అయితే ఎంకమ్మ గారు ఈ సీరియల్ లో మీరు ఏడుపుతో ఒక మానరిజమ్ ఫాలో అవుతారు కదా అని ఒక సారి మన ప్రేక్షకుల కోసం చేసిచూపిస్తారా అండ్ అసలు అది ఎలా వచ్చింది మీ ఐడియా నా లేక డైరెక్టర్ గారు చెప్పారా?"

ఎంకమ్మ: " ఒహ్హ్!! నా సిగ్నేచర్ ఏడుపా !! అది నాకు ఇలాగ వెంటనే ఏడుపు రాదు ఎప్పుడు ఏడవాలి అన్న మా డైరెక్టర్ వచ్చి నా జబ్బ గిల్లేవాడు ఆ నొప్పికి నేను జబ్బ రుద్దుకుంటూ ఏడిచే దానిని అదే నా మానరిజమ్ అయిపోయింది " అని నవ్వింది

రావమ్మా: "వ్వావ్ !!! ఎంకమ్మ గారి ఏడుపు రహస్యం మొట్టమొదటి సారి మా ప్రోగ్రాం లోనే చెప్పారు."

ఎంకమ్మ: " జబ్బలు అంటే గుర్తొచ్చింది. మొదట్లో మా ఆయనకి ఈ జబ్బగిల్లుడు తెలియక నాకు కండలు పెరిగాయి  అని అనుకునేవాడు  తర్వాత ఒక సరి రక్తం కారేసరికి అసలు విషయం తెలిసి రోజు తానే ఇంటి దగ్గర గట్టిగ గిల్లి పంపేవాడు.. ఆ గిల్లుడికి నేను రోజు అంతా  ఏడుస్తూ వుండే దానిని. దానినే మా బాబ్జి గారు తీసి సీరియల్ లో పెట్టుకొనే వాళ్ళు. నా "ఏడుపు" బిరుదుకి కారణం మా ఆయనే "

రావమ్మా: " వావ్ !! సో క్యూట్ !! మీరు చాలా లక్కీ !!! ఇప్పుడు డైరెక్టర్ బాబ్జిగారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం"

కూలీల గుంపుకి నాయకుడులాగ మాసిన గెడ్డం ఇరగపెరిగిన జుట్టు సీట్ పట్టనంత కాయం వేసుకొని ఒక విగ్రహం వేదిక మీదకి వచ్చింది

పరాదీప్: " వెల్కమ్ బాబ్జి గారు !! ఎలా అనిపిస్తోంది 10000 ఎపిసోడ్స్ అయ్యాయి జనాలు ఇరగబడి ఏడుస్తున్నారు మీ సీరియల్ చూసి ..."

బాబ్జి: "అందరికి నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి సీరియల్ చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన పాపి గారికి ధన్యవాదాలు. ఆయన అసలు ఎక్కడ ఖర్చుకి వెనకాడలేదు. దాని ఫలితామే ఈ మీట్."

(ఇంకా ఉంది ...)





2011-11-10

నీ దూకుడు--పేరడీ

నీ గోకుడు...సాటేవ్వడు
హే పరపరమంటూ ఎదురుగా ఎగబడుతూ గోకి
నఖలని ధనా ధనా దించే...ఏ... జొరే....
హమేషా గరగర అంటూ
కలయపడి కలకలమే రేపే
బినా ఏ భళా బురా సోచే...

కామన్ ఎవేరీబడి లెట్స్ గీక్ గీక్ గీక్ 

నీ గోకుడు
వనావే..వనావే..వనావే...వనావే..
సాటేవ్వడు
వనావే..వనావే..వనావే...వనావే..

దురద జాడ తెలియగనే దుమ్ముదులుపు తక్షణమే  
పనికి రాదు కనికరమే గోకుకొనుట అవసరమే
వదలనురా  దురదలనే ప్రళయ వీర క్షణ క్షణమే
దురదకి బై ఇక  చలో ఇక చక చక 
ఎడతెగ చెయ్ ఇక గోకుడు తై తక 
నఖములనే...కత్తులుగా...తలబడునే.....

కం అగైన్ థిస్ ఇస్ వాట్ వి కాల్ గోకుడు
ఎవేరీ బడి స్టాండ్ అలోంగ్ సే గోకుడు

నీ గోకుడు .....నీ గోకుడు ...గోకుడు గోకుడు
సాటేవ్వడు...సాటేవ్వడు...ఎవ్వడు...ఎవ్వడు


గీత పడుట దురద గుణగణమే
చేవగల గోళ్ళు కణకణమే
దురదకి దడ పుట్టించటమే
నేటి మన అభినవ మతమే
దురదనే ఎరుగని అధిపతినే
పాదరస ఒరవడి నరనరమే...

దురద రాదే ఎన్నటికే
హొష్ ఉడాయే దురదలకే
సమరమే సై ఇక చలా ఇక చక చక
ఎడతెగ చెయ్ ఇక గోకుడు తై తక

చొరబడుతూ...గురి పెడుతూ...కలబడుతూ.....
తానానా తనానా నానన.......
హే హే హే హే హే హే ....
హే బచ్కే తు జర కుజిలి హోరా హాయ్ క్యా
కమాల్ హాయ్ ఇక్ కమాల్ హాయ్ ఈ గోకుడు
జుకే నహి రుకే నహి ఈ గోకుడు

హే పరపరమంటూ ఎదురుగా ఎగబడుతూ గోకి

నఖలని ధనా ధనా దించే...ఏ... జొరే....


నీ గోకుడు .....నీ గోకుడు ...గోకుడు గోకుడు

సాటేవ్వడు...సాటేవ్వడు...ఎవ్వడు...ఎవ్వడు
గమనిక: ఇది ఎవరిని కించపరచటానికి కాదు...:)

---మీ నేస్తం

2011-06-03

పంచ్ డైలాగులు

సినిమా తారలు ఐ. టి లో పని చేస్తుంటే వాళ్ళ పంచ్ డైలాగులు ఇలాగ ఉండేవేమో:

చిరంజీవి:
1. వీర బగ్గర్ రెడ్డి...! బాగ్గే కదా అని లైట్ తీసుకుంటే హైకు కట్ చేస్తా!!!

2.తన బగ్గులని వెతకటానికని ఒక కొత్త టెస్టర్ ని తీసుకుంటే ఆ టెస్టర్ తో డైలాగు...
   "థాంక్స్ చెప్పకు..నువ్వు కూడా నాలుగు బగ్గులు వదిలేసి ఇంకో ముగ్గురికి ఉద్యోగం ఇప్పించు...వాళ్ళని థాంక్స్ కి బదులుగా ఇంకో ముగ్గురికి ఇప్పించమని చెప్పు"

౩. గాంధీగిరి చేస్తున్న చిరంజీవి కి ఒక టెస్టర్ వచ్చి ఇలాగ చెప్పాడు 
" అన్న ఒక డెవలపర్ వున్నాడు అన్న రోజు అదే బగ్గు పెట్టి కోడ్ కమిట్ చేస్తున్నాడు..నేను టెస్ట్ చేయలేక పోతున్న అన్న"
"కంగారు పడకు తమ్ముడు...ఇక నించి వాడు ఆ బగ్గు పెట్టినప్పుడల్లా నవ్వుతు ఆ బగ్గు రిపోర్ట్ డిలీట్ చేసేయి వాడి ముందే వాడే మారతాడు"

రెండు రోజులు పోయాక 
"ఏంటి  తమ్ముడు వాడు ఆ బగ్గు పెట్టటం మానేసాడా?"
"లేదన్నయ్య నన్ను మా మేనేజర్ కంపని నించి తరిమేసాడు"


బాలయ్య:
1.  చూడు పాజిటివ్ టెస్టింగ్ ఏ చూడు! నెగెటివ్ చూడకు! మాడిపోతావ్!! పిచ్చోదివైపోతావ్!!!
2. నీ కంపనీ కి వచ్చా!! నీ టీము లోకి వచ్చా!! నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నది సి# కోడె అయితే !! నువ్వు నిజంగానే ఈ మోడ్యులు చేసుంటే!! చెకిన్ చేయరా చూసుకుందాం!!
౩. క్లయింటు పోసిషన్ లో వున్నా బాలయ్య "ఇష్యులతో కాదురా చేయింజు రెక్వేస్టులతో చంపేస్తా"

  
మహేష్ బాబు:
1 . ఎప్పుడోచ్చాం అని కాదన్నయ్య బగ్గు పెట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్ 
2 . ఒక్క సారి కోడ్ చేస్తే నా లాజిక్ నాకే అర్ధం కాదు
౩. ఎవడు కోడ్ చేస్తే బ్రౌజరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు
4. బగ్గులు చూడాలి అనుకో పర్లేదు..కోడు చూడలనుకోకు పిచ్చేక్కిపోతావ్

జూ. ఏన్.టి. ఆర్

1 .  గూగుల్  తోడూ ఇష్యూ దొరక్కుండా కోడ్ చేస్తా
2 .  ఈ సీమలో మొదట బగ్గు చేసింది మాతాత మొదట క్రాష్ చేసింది మా బాబాయి...వాటితో నన్ను బయపెట్టలేరు..(క్యు.ఏ కి వార్నింగ్ ఇస్తూ)
౩. ఆన్ సైటు నించి వచ్చాడు సాఫ్టుగా లవర్ బాయ్ లాగున్నాడు అనుకోవద్దు క్యారెక్టర్ కొట్టగా వుందని ట్రై చేశాను లోపల ఆఫ్ షోరూ డెవలపర్ అలానే ఉన్నాడు...బయటకి వస్తే రచ్చ రచ్చె...

నోట్: పైన రాసిన డయిలాగులు ఎవరిని కించపరచటానికి కాదు గమనించగలరు

ఈ ఆలోచన ఇచ్చిన సూర్యపవన్ కి నా కృతఙ్ఞతలు.

ఇట్లు
మీ నేస్తం

2011-05-30

యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు :(

యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...
పండగ లేదు పబ్బం లేదు రాతిరిలేదు పగలు లేదు...
పెళ్ళాం లేదు పిల్లలు లేరు పని మాత్రం గంపెడుంటది...
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి బ్రతుకులు...

సెనివారమెల చేలినేంట పెట్టుకొని సినిమాకి పోతే...
సెల్లుమోగే గుండె పగిలే..ఆఫీసుకి రమ్మని ఫత్వాలు వచ్చే...
మెల్లంగ చూసి చెలి చెవిన వేస్తే చీ..పో అంటే చీదరించి పంపే...
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...

అర్దరాతిరేల క్లయింటు లయిన్లకోచ్చే... అర్ధం కాని బాషలో లెఫ్టు రైటు ఇచ్చే
పోద్దుగాలికల్ల నాగిట్ల కావలనడిగే...కళ్ళు మంటలోచ్చే కీళ్ళ నేప్పులోచ్చే...
తెల్లారే సరికల్లా నాకు నూట నాలోగోచ్చే...క్లయింటు గాడికేమో నా మీద కోపం వచ్చే..
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...




2010-10-25

నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???

అది జనవరి మాసం...సంక్రాంతి సమయం... దూరం గా నక్కలు నిద్రపోతున్న సమయం...దగ్గరలో ఉన్న కోళ్ళు కూస్తున్న సమయం.నలుపంటే  ఇష్టంలేని రామేశం రామేశ్వరం నించి తిరిగి వస్తున్న సమయం.....

రామేశం రామాలయం సందు తిరుగుతుండగా అడ్డం గా ఒక నల్ల కుక్క తన వీపు మీద నల్ల పిల్లిని ఎక్కించుకొని ఎదురుగా వచ్చింది. దానిని చూడగానే రామేశం రామనామం జపించటం మొదలెట్టాడు. అలాగే భయపడుతూ నల్ల పిల్లి కుక్కని చూసాను ఏమవుతుందో అని అడుగులోఅడుగు వేసుకుంటూ వెళ్తుండగా వయ్యారం గా వచ్చింది నల్ల చీరకట్టుకొని నీలాంబరి. రామేశాన్ని చూస్తూనే "ఏరా రాము ఎలాగున్నావ్!!! పొద్దెక్కింది ఇంకా నిద్రలేవలేదా" అని అన్నది.

"అదేంటి నేను నడుస్తుంటే నిద్రలేవలేదా అంటుంది నీలాంబరి ఆంటి" అని ఆలోచిస్తూ అలా నడక ముందుకి కొనసాగించాడు మన రామం. ఇంటిదేగ్గరకి వెళ్ళగానే నల్ల పిల్లి ప్రభావం వల్ల నాన్న ఏమన్నా వాకిట్లో ఉన్నాడేమో అని తోంగిచూసాడు. అమ్మ పేడనీళ్ళు కలుపుతోంది. నాన్న జాడ లేదు. హమయ్య నాన్న లేడు ఇంతకీ అమ్మ కలిపేది  "నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???"  అని ఇంట్లో అడుగుపెట్టాడో లేదో రామం ని చూడని వాళ్ళమ్మ పేడ నీళ్లు ఒక చెంబుతో తటాలన రామం మొహం మీద కొట్టింది.

వాసన చూస్తూ "హమయ్య తెల్లవుపేడే" అని కళ్ళు తుడుచుకుంటున్న రామం ఎదురుగా కనపడింది రాత్రి కప్పుకున్న బొమ్మల దుప్పటి నల్లని అంచు నీటిలో బాగా తడిచి బొటబొటా కారుతూ. దుప్పటి తీసి చూస్తే అదే నల్ల చీర కట్టుకొని నీలాంబరి  ఆంటీ అమ్మ తో మాట్లాడుతూ..తిరిగి చూస్తే ఎర్రటి కళ్ళతో నిప్పులు చెరుగుతున్న నాన్న.....

ఇట్లు
మీ నేస్తం

2010-03-03

"తారే జమీన్ పర్ "--ఒక తమాషా

చాల రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను నా స్నేహితులతో కలిసి "తారే జమీన్ పర్" సినిమాకి వెళ్దాము అనుకున్నాను. మా స్నేహితులలో ఒకడు తన ప్రియురాలికి(ఇప్పుడు పెళ్లి అయ్యిపోయిందిలెండి) ఆ సినిమాకి తనతో వెళ్తాను అని చెప్పాడు అని అన్నాడు. సరే పోయేది ఏముంది ఆ అమ్మాయికి ఇబ్బంది లేక పోతే మాతో రమ్మని చెప్పాము. ఆ అమ్మాయి ఒప్పుకోవటంతో మేము ఐదుగురం ఆ అమ్మాయి మొత్తం ఆరుగురంకలిసి ఆ సినిమాకి వెళ్ళాం. సినిమా చాలా బాగుంది. నేను వాళ్లిదరి పక్కన సీటులో కూర్చున్నా. సరే కొంచెం సినిమా అయ్యాక సినిమా లో పిల్లాడిని హాస్టల్లో వదిలేసి వాళ్ళ అమ్మానాన్న వెళ్ళే సీను, అందులో నటించిన పిల్లాడు చాలా బాగా చేసాడు ఆ సన్నివేశంలో. అందులో లీనమై చూస్తూ ఎందుకో పక్కకి తిరిగా. నాకు అక్కడ చూసిన సన్నివేశానికి నవ్వు ఆగలేదు. మా స్నేహితుడు,వాడి ప్రియురాలు ఇద్దరు ఆ సన్నివేశంలో లీనమైపోయి తెగ ఏడుస్తున్నారు. వీడు ఆ అమ్మాయి చున్నీ ఒక అంచుతో తుడుచుకుంటుంటే ఆ అమ్మాయి ఇంకొక అంచుతో తుడుచుకుంటోంది. అక్కడ నించి ఆ సినిమా అయ్యే దాక ఏ విషాద సన్నివేశం వచ్చిన తెర వంక చూడాలో వెళ్ళని చూడాలో అర్ధం కాక సగం సినిమా చూడలేదు. సినిమా నించి అందరు కళ్ళు ఎర్రబడి బయటకి వస్తుంటే నేను మాత్రం పొట్ట పట్టుకొని నవ్వు కుంటూ బయటకి రావాల్సి వచ్చింది . చివరికి రెండో సారి ఒక్కడిని వెళ్లి చూడాల్సి వచ్చింది.

2009-11-19

నేను.... నా క్లయింటు.... నా పాట్లు

సమయం: సాయంత్రం 6:15
ప్రదేశం: మా కారాగారం శిఖరాగ్రం  (ఆఫీసు పైన ఉన్న ఖాళీ ప్రదేశం)

అప్పటి దాకా మా ఆఫీసువాళ్ళు పెట్టే ఫలహారం తినేసి ప్రశాంతంగా  నాగర్జునా ఢాన్సులాగా పడాదామా వద్దా అని వాన ఆలోచిస్తుండగా హాయిగా ప్రకృతి ని ఆస్వాదిస్తున్నాను. ఇంతలో నా సెల్లు నా పరవశానికి భంగం కలిగిస్తూ నా కాలు గడగడ లాడించింది (నిశబ్దంలో పెట్టాను ) ఏ వెధవ సొల్లు చెప్పటానికి చేసాడా అని చిరాగ్గా దాని వంక చూసాను. "వారపు పని చిట్టా" (వీక్లి స్టేటస్ రిపొర్ట్ ) చెప్పటానికి సమయమయ్యింది అని నా సెల్లు గంట మొగించి చెప్తొంది.

నాకు ఎక్కడ లేని బాధ ఇంకా వెంటనే పాకిస్తానుకి కాని తాలిబాను కి గాని వెళ్ళి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక "ఆత్మాహుతి దళ" యెధుడిని తెచ్చి మా క్లయింట్ మీదకి వదలాలి అన్నంత కోపం వచ్చింది. కానీ వాడి ఉప్పు తింటున్నాను అని గుర్తొచ్చి నా మనసుని, దాంట్లో  కోపాన్ని "గొద్రేజ్" బీరువాలో దాచేసి "స్వాతిముత్యం" కమల్ హాసన్ నవ్వు ఒకటి మొహాన పులుముకొని "సమావేశపు గదికి"(కాన్ఫరెన్స్ రూమూ) వచ్చాను. అక్కడ పొరాటానికి సిద్దమవుతున్న సైనికుడు తన అస్త్రాలు సరిచూసుకుంటునట్టు మా లీడు "లాపుటాపు" సర్దుతున్నాడు.

ఈ రోజు ఎంతసేపు బుర్ర తింటాడో అని గుండెల్లో భయంగా వున్నా పైకి మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతున్నా. ఇంతలో ఆ శుభగడియలు రానే వచ్చాయి. మా లీడు ఫొను కలిపాడు కాసేపు అర్ధం కాని భాషలో అమ్మనాబూతులు తిట్టించుకున్నాక కొన్ని మీటలు నొక్కితే మా క్లయింటు లైనులోకి వచ్చాడు.          

వస్తూవస్తూనే సుడిగాలిని తలపిస్తూ "HOWDY.. HOWDY..." ఒక అరుపు అరిచాడు

దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా పూర్వానుభవం వల్ల వాడు మేము ఎలా వున్నామో అని అడుగుతున్నడు అని అర్ధం చేసుకున్నాము. "బాగానే ఉన్నాము" అని ఆంగ్లంలో చెప్పాము. కానీ మనసులో మాత్రం "మా ఖర్మ కొద్ది నీ దగ్గర పడ్డాము" అని అనుకున్నాను

ఎంతైనా భారతీయులం మన సంస్కారమెలా మర్చిపోతామని "HOW R U *****" అని అడిగాము. దానికి వాడు "SUPERB" అన్నాడు. వెంటనే మాకు మూడింది అని రాత్రికి నిశాచరులని కలవక తప్పదని అర్ధమైపోయింది

జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపొయింది ఇంకా నష్టం జరగకుండా చూడాలి అని వెంటనే నష్టనివారణ  చర్యలు మొదలుపెట్టము. వాడికి అవకాశం ఇస్తే ఎక్కడ సొల్లు మొదలు పెడతాడో అని తుపాకి పేల్చగానే పరిగెత్తే ఉసియన్ బోల్ట్ లాగా మా మా లీడు "SHALL WE START WITH PLAN FOR CALL *****" అని అన్నాడు.

క్ల: "SURE........."

వెంటనే మొదటి దశలో సొల్లు తగ్గించిన మా లీడులో నాకు ముక్కొటి దేవతలు మూకుమ్మడిగా కనిపించారు. కాని మనసులో ఏదో మూల పొద్దునే స్కూలుకెళ్ళే పిల్లాడి లాగా నేను నా భుజాన ల్యాపుటాపు సంచి తగిలించుకొని సాయంత్రం 9:00 కి చూడబొయే 2012 ని తలుచుకుంటూ వస్తుండగా పక్కింటాళ్ళ పిచ్చి కుక్క ఎదురింటాళ్ళ నల్ల పిల్లి కలిసి సరదాగా వాకింగు చేస్తూ నాకు ఎదురు వచ్చాయే అయినా వీడు సొల్లు మొదలెట్టలేదు అని ఆనందిస్తుండగా

క్ల: "BUT I WANT US TO DO A SHORT BRAINSTROMING TODAY AFTER UR POINTS........." అన్నాడు

వెంటనే నా ఆత్మారాముడు నిద్రలేచి "ఛీ వెధవా!! జల్సా లో సునీలు లాగ నీకు ఏది సరిగ్గావినే అలవాటు లేదు... నీ ఆత్మారాముడిగా నీ బాధలు భరించలేక పొతున్నా అని నోటికొచ్చినవి కొన్ని రానివి కొన్ని తిట్టేసాడు"

వీడి తిట్ల కంటే మా క్లయింటు తిట్లే మేలు వాడు ఏమి తిట్టినా సగం అర్ధం కావని నా ఆత్మారాముడికి జో కొట్టి వాడి మాటల మీద దృష్టి పెట్టాను.

మా లీడు ఆరంభశూరత్వాన్ని కొనసాగిస్తూ మేమూ ఈ వారము చేసిన పనులన్ని వాడికి ఏకరువు పెట్టుకుంటున్నాడు. సరే ఈ సునామి త్వరలో నా మీదకి వస్తుంది అని బ్యాటింగ్ కి వచ్చేముందు వ్యాయామాలు చేసి దిగినట్టు ఒక్క సారి నేను ఈ వారం చేసినవన్నీ నేమరువేసుకుంటున్నా.. ఈలోగా నా వంతు వచ్చేసింది. నేను అనుకున్నవన్నీ చిన్నప్పుడు పాఠాలు అప్పచెప్పిన అనుభవంకొద్ది గడగడ అప్పచేప్పేసా.

"WELL...I APPRECIATE YOU EFFORTS BUT CAN YOU REPEAT IT ONCE AGAIN" అన్నాడు వాడు.

అరకిలోమీటరు పరిగెత్తి అక్తర్ బంతి విసిరితే అంగుళం కూడా కదలకుండా బంతిని ఆపిన ద్రావిడ్ మీద అక్తర్ కి ఎందుకు కోపం వచ్చిందో నాకు  అప్పుడు అర్ధం అయ్యింది. చేసేది లేక నేను నా పాఠం నెమ్మదిగా అప్పచేప్పాను.

"GREAT!!!.." అన్నాడు వాడు

హమయ్య!!! ఈ రోజుకి బ్రతికి పోయాను అని అనుకున్నా మనసులో. మిగితా వాళ్ళ పాఠం వింటుండగా నాకు కాస్త కునుకు పట్టింది. నిద్రపోతుంటే కలలో మా క్లయింటు అరుంధతి లో అఘోరా వేషం వేసుకొని నా బుర్రని సాయంత్రం తిన్న దోసతో నంచుకుతింటున్నాడు. "అయ్య బాబోయ్" అని టక్కున లేచి చూసాను.

మా క్లయింటు అప్పుడే వాడి కాఫీ తెచ్చుకొని మమ్మల్ని ఊరించే ప్రయత్నమో లేక సహజ తత్త్వమో తెలియదు కాని "బొమ్మరిల్లు" హాసిని లాగా గట్టిగా జుర్రుకుంటూ తాగుతున్నాడు. నాకు తిన్న అల్పాహారం అరిగిపోయి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి.  "నీ కాఫీలో కందిరీగ కూలా అని" మనసులో అనుకుంటూ దీనంగా గడియారం వంక చూసాను. అప్పటికే చిన్న ముల్లు ౩౦ డిగ్రీలు తిరిగేసింది(గంట గడిచింది అని నా కపిహృదయం ) ఇంకా వదలట్లేదు.

అప్పటికే అందరు ఏమి చేసారో ఏమి చేయబోతున్నారో చెప్పేశారు ఇంకా వెళ్ళచ్చు అనుకుంటుండగా "OK now lets start brainstroming on %^*(@@^&!&!**@^@#%#^&"  ఐదు నిముషాలు ఊదరగొట్టి "LETS SHARE OUR VIEWS" అన్నాడు .

మనకి ఇచ్చిన అంశం మీద అవగాహన వున్నా లేకున్నా మాట్లాడటం "గుంపు సంభాషణలలో"(గ్రూపు డిస్కషన్) అలవాటే కాబట్టి ఉత్సాహం ఆపుకోలేక "IN MY VIEW....." అని ఏదో వాగేశా. 

"YEAH THATS AN EXCELLENT THOUGHT BUT HOW CAN THIS FIT....." అంటూ దొరికారురా ఇంకా నాకు "నిన్ను వదల బొమ్మలి వదలా" అని వాడి స్టైల్ లో వాడు బుర్రలో  గుజ్జు తాగే కార్యక్రమంలో మునిగిపోయాడు.

పొద్దున్న కనిపించిన పిల్లి కుక్క గుర్తొచ్చి ఇంకో ఇద్దరు యోధుల్ని కూడా కొనాలి వాటికోసం అని అనుకుంటూ చుట్టూ చూసాను. అందరు  నా వంక వాడి మానన వాడు ఏదో  చెప్తుంటే ఎందుకురా నువ్వు మధ్యలో మాట్లాడవు (మరీ ఇంత సాత్వికం గా కాదు కాని అన్ని రాస్తే బాగోదు అని రాయట్లేదు) అనట్టు చూస్తున్నారు.

ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా సరే సమరసింహారెడ్డి సినిమా లాగా  నన్ను చంపటానికి ఎక్కడ స్కుటీలు, పాషను ప్లస్సులు వేసుకొని ఎక్కడ తరుముతారో  అని భయం వేసి మా లీడు వంక "అన్యదా శరణం నాస్తి" అనట్టు చూసాను.

దానికి మా లీడు నాకు పాంటు షర్టు వేసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా వంక భయపడకు అని చెప్పి
"ACTUALLY ***** the intention was like #!$$%%@^&!*!" అని ఏదో  సర్ది చెప్పాడు.

అలాగా చిన్న ముల్లు ఇంకో  30 డిగ్రీలు తిరిగే దాకా వాడు బుర్ర తిని వదిలితే చావు తప్పి కన్నులోట్టపోయింది లే ఫర్వాలేదు అనుకుంటూ సినీమా కి పరుగులు తీశాను.

ఇదండీ  మా క్లయింటుతో   నేను పడ్డ పాట్లలో ఒకటి.