నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2010-03-03
"తారే జమీన్ పర్ "--ఒక తమాషా
చాల రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను నా స్నేహితులతో కలిసి "తారే జమీన్ పర్" సినిమాకి వెళ్దాము అనుకున్నాను. మా స్నేహితులలో ఒకడు తన ప్రియురాలికి(ఇప్పుడు పెళ్లి అయ్యిపోయిందిలెండి) ఆ సినిమాకి తనతో వెళ్తాను అని చెప్పాడు అని అన్నాడు. సరే పోయేది ఏముంది ఆ అమ్మాయికి ఇబ్బంది లేక పోతే మాతో రమ్మని చెప్పాము. ఆ అమ్మాయి ఒప్పుకోవటంతో మేము ఐదుగురం ఆ అమ్మాయి మొత్తం ఆరుగురంకలిసి ఆ సినిమాకి వెళ్ళాం. సినిమా చాలా బాగుంది. నేను వాళ్లిదరి పక్కన సీటులో కూర్చున్నా. సరే కొంచెం సినిమా అయ్యాక సినిమా లో పిల్లాడిని హాస్టల్లో వదిలేసి వాళ్ళ అమ్మానాన్న వెళ్ళే సీను, అందులో నటించిన పిల్లాడు చాలా బాగా చేసాడు ఆ సన్నివేశంలో. అందులో లీనమై చూస్తూ ఎందుకో పక్కకి తిరిగా. నాకు అక్కడ చూసిన సన్నివేశానికి నవ్వు ఆగలేదు. మా స్నేహితుడు,వాడి ప్రియురాలు ఇద్దరు ఆ సన్నివేశంలో లీనమైపోయి తెగ ఏడుస్తున్నారు. వీడు ఆ అమ్మాయి చున్నీ ఒక అంచుతో తుడుచుకుంటుంటే ఆ అమ్మాయి ఇంకొక అంచుతో తుడుచుకుంటోంది. అక్కడ నించి ఆ సినిమా అయ్యే దాక ఏ విషాద సన్నివేశం వచ్చిన తెర వంక చూడాలో వెళ్ళని చూడాలో అర్ధం కాక సగం సినిమా చూడలేదు. సినిమా నించి అందరు కళ్ళు ఎర్రబడి బయటకి వస్తుంటే నేను మాత్రం పొట్ట పట్టుకొని నవ్వు కుంటూ బయటకి రావాల్సి వచ్చింది . చివరికి రెండో సారి ఒక్కడిని వెళ్లి చూడాల్సి వచ్చింది.
2010-03-01
నా ఆటను చేడకోడుతూ వచ్చింది అది/ఆడు
ఒకానొక వాన కురిసిన రాత్రి వేడిగా పకోడీలు తింటూ కమ్మగా పాత పాటలు వింటూ నేను కంప్యుటరులో జి టి ఎ ఆడుతుండగా మా రూములో ఏదో చప్పుడు అయ్యింది. అసలే రూములో పని పాడు లేకుండా ఖాళీగా ఉండేవాడిని నేనే కాబట్టి ఆడుతున్న ఆటని మధ్యలో ఆపి ఏంటా అని రూములో వెతకటానికి పోయాను. అన్ని చోట్ల వెతికాక ఏమి కనిపించక పోయే సరికి ఇది వాడి/దాని పనే అయ్యుంటుంది అని నిర్ణయించేసుకొని మళ్ళి నా చుట్టుపక్కల నిశితంగా వెతకటం మొదలుపెట్టాను.
అలా వాడు/దాని కోసం ఏంటో వెతకగా అలిసి సొలసి ఇంకా వెతక లేక హాలులో మంచం మీద కూలపడిపోయాను. వాడిని/దానిని చంపేయాలి కాని ఎలాగా అని ఆలోచిస్తుండగా. మళ్ళి దాని/వాడి అరుపు నాకు చాలా దగ్గరలో వినిపించింది. ఆ అరుపుకి మళ్ళి నా వెతుకులాట మొదలుపెట్టి.సరిగ్గా నేను కూర్చున్న మంచం కింద పెట్టిన బూట్లలోనుంచి మళ్ళి అరుపు వచ్చింది. ఈ సారి నా కోపం బి పి మీటరుకి కూడా దొరకకుండా పెరిగిపోయింది. వెంటనే దానిని చంపటానికి కర్రతీసుకువచ్చాను.
నేను కర్ర తీసుకొని సిక్స్ కొట్టే సచినులాగా గోలు కొట్టే ధనరాజ్ పిళ్ళై లాగా రెడీ అయ్యి బూటుని కర్రతో కొంచెం కదిపాను. ఆ కుదుపుకి మెల్లమెల్లగా బయటకి వచ్చింది/వచ్చాడు. "మియ్య్యావ్వ్వ్ మియ్యావ్వ్వ్" అని అరుచుకుంటూ ఈ మధ్యనే మా వీధిపిల్లికి పుట్టిన పిల్లిపిల్ల. మూసినా కళ్ళని నెమ్మదిగా చిట్లిస్తూ తెరుస్తోంది. దానిని అలా చూసేసరికి నా చంపాలన్న కోరికని చచ్చిపోయింది. వెంటనే దగ్గరకి తీసుకోవాలి అనిపించింది కాని మళ్ళి ఇల్లుఅలవాటు అయితే ఇబ్బంది అని భయం వేసి దానిని నెమ్మదిగా తరిమేసాను.
గమనిక: ఆ పిల్లి పిల్ల ఆడదో మగదో తెలియక అది/ఆడు అని వాడాను. మీకు నచ్చిన జాతికి చెందినదిగా భావించి చదవగలరు

Subscribe to:
Posts (Atom)