నిన్న నేను కొంచెం ఆలస్యంగా నిద్రలేవటం వాళ్ళ ఆఫీస్ కి వచ్చేసరికి 11 అయ్యింది. వచ్చేసరికి చొక్కా తడవటం ఎండటం కూడా అయ్యిపోయింది. నా చిన్నతనం అంతా దాదాపుగా విజయవాడ దగ్గరలో అవ్వటం వల్లనేమో వడదెబ్బ కొట్టకుండా తట్టుకున్నాను లేక పోతే ఈ ఎండకి నేను నిమ్స్ లో భర్తీ అవ్వాల్సి వచ్చేది.
నాలుగు సంవత్సరాలు క్రితం నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఇలా వుండేది కాదు ఎంత ఎండ వున్నా చెమట వచ్చేది కాదు. కాని ఈ మద్యన బాగా చెమట వస్తోంది. సరే నిన్న ఆఫీస్ లో పని వత్తిడి తక్కువ వుండటం వల్ల నా ఆలోచనలు ఎండమీదకి మళ్ళాయి. అసలు ఇంత ఎండలు రావటానికి కారణం ఏంటి అని ఆలోచించటం మొదలుపెట్టాను.
నా ఆలోచనలలో తెలిందేంటి అంటే ఇంత ఎండ ఉండటానికి కారణం మనందరి స్వార్ధం...కేవలం మన స్వార్ధం మాత్రమే..దేవుడు మనకి బుర్రని ఇచ్చాడు అని మురిసిపోయే మనిషి కి దాని తో పాటు తనకి గంపెడు స్వార్ధం కూడా వుంది అని గుర్తించటానికి ఇష్టపడడు...
ఇంతకీ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే నేను ఒక గంట బుర్ర గోక్కుంటే నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ఈ వేడికి కారణం మనమే హైదరాబాదు వాసులం.. వున్నా అన్ని కొండలని బండాలని పగలకొట్టి...చెట్లన్నీ తెగనరికి బహుళ అంతస్తుల మేడలు కడతాము..వాటిని కొనటానికి మనం మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గాడిద చాకిరికి కూడా సిద్దమవుతాం(ఈ ఎం ఐ కట్టాలికదా )..ఇదంతా నేను తప్పు అనట్లేదు కాని ఇక్కడ ఒక చిన్న నష్టాన్ని మనం గుర్తించట్లేదు మనం ప్రకృతికి నష్టం చేస్తున్నాం కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయటం మన కనీస బాధ్యత అది మరచిపోతున్నాం..
దీనివల్ల మనం విపరీతమైన ఎండలు మాత్రమే కాదు మన భావితరాలను కూడా భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం.. చెట్లు లేక పోవటం వల్ల భూగర్భ జలాలు ఇక్కడ ఉండట్లేదు దాని వల్ల మన మనకి నీటి ఎద్దడి ఏర్పడుతోంది ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి హైదరాబాదు మరో ఎడారిలాగా తయారు అవుతుంది.
ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం మనం పెద్ద పెద్ద తోటలు పెంచానవసరం లేదు. ప్రతి ఒకళ్ళు వారి ఇళ్ళలో ఒక చెట్టు నాటితే చాలు మళ్ళి నీటి ఎద్దడి విపరీతమైన ఎండలు ఉండనే ఉండవు..
కొన్ని సలహాలు:
1 . ఇండిపెండెంట్ ఇల్లు కలవారు మీ ఇంటి వాకిట్లో కాని దొడ్లోకాని ఒక వేప చెట్టు పెంచండి దీని వల్ల మీకు చాలా లాబాలు వుంటాయి
లాభాలు:
అ. వేపచెట్టు గాలి చాలా రోగాలను దూరం గా ఉంచుతుంది..దీని వల్ల మీకు ఆసుపత్రి బిల్లు ఆదా అవుతుంది
ఆ. చల్ల గాలి వీస్తుంది విద్యుత్ కోత సమయం లో దీని కింద పడుకుంటే మీకు ఎ.సి దండగ అనిపిస్తుంది
ఇ. వీప చెట్టుకు ఎన్నో మూలికా విలువలు వున్నాయి చాలా దెబ్బలని నయం చేయగల శక్తీ వుంది
ఈ. ఇక ఉగాదికి మీరు వ్యాపారం పెట్టచ్చు అని నేను ప్రఎకంగా చెప్పకర్లేదు అనుకుంటా:)
ఉ. పెద్దపెద్ద వేళ్ళు ఉండవు కాబట్టి పునాదులు పాడుఅవ్వవు
నష్టాలు:
అ. ఊడవటం కష్టం గా వుంటుంది చాలా ఆకులు రాలుతుంటాయి
2 . అపార్టుమెంట్ కలవారు వారి సంఘానికి చెప్పి వేపచెట్లు నాటించవచ్చు.
౩.అద్దె ఇంటిలో వుండే వారు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు వాటిని ఇల్లుమారే సమయంలో మార్చటం తేలికగా వుంటుంది.
ఈ చెట్లు పెంచటానికి మీరు పడాల్సిన శ్రమ పెద్దగ ఏమి వుండదు.. రోజు మీరు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఒక సారి దానికి నీరు పోస్తే సరిపోతుంది..చాలా వరకు వేపకి తెగులు రాదు కాని ఏమైనా వస్తే ఒక రోజు పురుగు మాడు కొట్టాలి అంతే...
మీరు చేసే ఈ చిన్న పని మీ పిల్లల భవిష్యత్తుని మార్చగలదు..నేను చెప్పను అని కాదు మీరే ఆలోచించుకోండి...మీరు మొక్కలు నాటతారు అని ఆశిస్తూ సెలవ్...
మీ నేస్తం