2011-01-03

కవిత:: ఆ క్షణం

ఉవ్వెత్తున ఎగసిపడే సంద్రం ఉనికి కోల్పోయిన క్షణం
రహదారి రణగొణ ధ్వనులు మరచి మూగబోయిన క్షణం
ఉదయభానుడు ప్రజ్వలజ్యోతి నశించి నల్లబోయిన క్షణం
నన్ను వీడి నా ఆత్మ అంతర్ధానమవుతున్న ఆ క్షణం