నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు హృతిక్ రోషన్ అంటే బాగా ఇష్టం. కాని అప్పుడు వుండే లిమిటెడ్ బడ్జెట్ కి అన్ని సినిమాలు చూడటం అయ్యేది కాదు. అలా ఇష్టం కొద్ది చూసిన ఒక సినిమా "లక్ష్య"..అందులో "మై ఐసా క్యు హుం" అని ఒక పాట వుంటుంది. అందులో డాన్సు కోసం పడి పడి చూసేవాడిని ఆ పాటని నా కంపూటర్ లో పెట్టుకొని...కాని అప్పుడు నాకు తెలియదు నా జీవితం లో అది situational సాంగ్ అని...ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
అరే వారానికి మరీ ఒక్క రోజు ఆఫీసు కి రాబుద్ధి అవుతోంది :( మిగిలిన రోజులు బలవంతాన రావాల్సి వస్తోంది. జీవితం అంతా ఏదో స్తబ్దుగా అయ్యిపోయింది...ఈ మధ్యనే ఏదన్నా ఊరు వెళ్లి వస్తే బాగుంటుంది అని మహాబలిపురం, చిదంబరం, నైవెల్లి ఇంకా పాండిచెర్రి చూసి వచ్చాను. వచ్చాక ఒక వారం బాగానే వుంది కొత్తగా మళ్లీ ఇప్పుడు ఇదివరకటి పరిస్థితే :(...
ఏమిటో జీవితానికి రవితేజ చెప్పినట్టు బొత్తిగా కిక్ లేకుండా పోయింది :(:(:(:(...కొత్త గా ఆటలు మొదలు పెట్టాను...జనాలని ఎక్కువ కలుస్తున్నాను ఐనా ఏదో ఒక మూల ఒక అలసట ఒక స్తబ్దత అలా వుండి పోయాయి..అందుకే నేను తెలుగులో క్షమించాలి హైదరాబాదు లో ఉంటున్న కాబట్టి హైదరాబాది బాషలో పైన పేర్కొన్న పాట పాడుకుంటున్నా:(;(;(:(:(
"నేన్ గిట్లేన్దుకున్న నేన్ గిట్లేన్దుకున్నా....నేను గిట్లేన్దుకున్నా...నేను గిట్లేన్దుకున్నా....
ఏం జెయ్యాల సమజైతల్లె... ఇప్పుడు నేను ఏమి చెయాల .... జిన్దగిబార్ నాకైతే ఏం చేయాలో సమజవ్వదేమో...."
ఇట్లు
మీ నేస్తం