2011-08-22

పేరడి:సదా శివ సన్యాసి

ప్రతి బిల్డ్ కి కొత్త బగ్గులు వస్తుంటే కడుపు మండిన ఒక టెస్టర్ పాడుకుంటున్న పాట:

(ఖలేజా లో "సదా శివ సన్యాసి...పాటను గుర్తుతెచ్చుకోండి)

సదా శివ సన్యాసి మా డెవలపర్ సన్నాసి  
వాడి బగ్గులు చూసి పొంగినాయి నా కళ్ళు వాచీ
ఏ బటను క్లిక్కు కాదుగా
డ్రాపు డవును లిస్టే రాదుగా
చూడ చెత్తగా ఉంటాదిరా
వేసేయ్ రా ఊరు వాడా దండోరా !!

ఏ స్టయిలుల ఏ స్క్రిప్టుల పొడ లేదురా 
ఏడు ఏళ్ళ అనుభవం  వుందిరా 
నాలుగు లైన్ల కోడులో నలభై బగ్గులే వచ్చురా
వర్డ్ చించి నువ్వు చెప్పిన వీడి కోడు బాగుపడదురా...
 మేధావిలా  ఓ జ్ఞానిలా ఉంటాడు ఏం లీలా 
నాకు  వీడు నైటుమేరు వీడి పీడా నాకు పొదూ
నన్ను పట్టిన శని వీడు వేరే ప్రాజెక్ట్కి పోనే పోడు  

ఓ మై గాడ్ వాట్ షుడ్ ఐ డు 
ఓ మై గాడ్ వాట్ షుడ్  ఐ డు

2011-08-08

ఎందుకీ సమ్మె/బంద్/రాస్తా రోకో/ రైల్ రోకో??

ఒక హైదరాబాదీ గా నాకు కనీసం నెలకి ఒక రోజు పైన మాట్లల్లో ఏదో ఒకటి వినిపిస్తుంది..నేను ఉండే చోట దేని ప్రభావం ఎక్కువ ఉండదు కనుక వీటి వలన నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. కాని దీని ప్రభావం కొన్ని వర్గాల ప్రజల మీద భారీగా పడుతోంది. ఆ వర్గం పేరే బడుగు బలహీన మరియు మధ్య తరగతి వర్గం.

ఈ వర్గం ప్రజలు రోజు పని చేస్తే కాని వాళ్ళ ఇంటిలో పొయ్యి వెలగదు. పని కి పోకపోతే పస్తే చాలా కుటుంబాలకి. మన నాయకులు రాష్ట్రము విదిపోవాలనో లేక కలిసేవుండాలనో ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి ఈ ఉద్యమాలు చేద్దాం అని చెప్తారు. మరి ఉద్యమం చేసాక ఒరిగిందేంటి అని చెప్పారు మళ్ళి అదే సమస్యకి ఇంకో సరి వేరే ఉద్యమం అంటారు. దీని వల్ల ప్రభుత్వం మీద వత్తిడి పడిందో లేదో తెలియదు కానీ సామాన్యుడు మాత్రం నరక యాతన పడుతున్నాడు. బంద్ పిలుపు వస్తే ఆ రోజు పస్తే చాలా కుటుంబాలకి...ఇంకొన్ని కుటుంబాలకి బంద్ వల్ల లబ్ది పొందాలి అని అనుకునే వ్యాపారస్తులవల్ల కష్టాలు...బంద్ రోజున ఆటో మేటరు మీద నడపారు నోట్లమీద నడుపుతారు అర్ధం కాలేదా వాడి నోటికి వచ్చిన రేటు చెప్తాడు...బంద్ కాబట్టి చాలా తక్కువ ఆటోలు నడుస్తాయి...ఇంకా వాడు అడిగినంత ఇవ్వటమో లేక ఇంకో  దారేదన్నా చూసుకోవతమో చేయాలి. ఇంకా కూరగాయలు, నిత్యావసర సామానుల ధరలు కూడా పెరుగుతాయి కాని అప్పుడు ఒక రోజు కాదు ఒక రెండు మూడు రోజులు వుండాలి ఉద్యమం.

ఈ ఉద్యమాల వలన సామాన్యులకి భవిష్యత్తులో వచ్చే లాభం ఎంతో ఆ భగవంతునికే తెలియాలి కాని ఇప్పుడు మాత్రం జనం నరకయాతన పడుతున్నారు. ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్తున్న ఉద్యమం వల్ల అదే ప్రజలకి కష్టం కలుగుతోంది కాని ఉద్యమనాయకులకి గాని ప్రభుత్వానికి కాని అంతగా కష్టం కలగట్లేదనే చెప్పాలి. ఇంక ఈ ఉద్యమానికి విద్యార్దులని వాడుకొని ఇరు వర్గాల వాళ్ళు చాలా జీవితాలని నాశనం చేస్తున్నారు. వాళ్ల భవిష్యత్తు బాగు చేయమనే కదా ఈ నాయకులని ఎన్నుకుంది వల్లనే ఉద్యమ బాటలో నడిపి వాళ్ల చదువు నాశనం చేసి ఈ నాయకులూ ఇప్పటి సాదించింది ఏంటి? వాళ్ళ భవిష్యత్తుకి నిజంగానే బంగారు బాట వేస్తారా?? అన్న అంశాలు పక్కన పెడితే వాళ్ళని రెచ్చగొట్టటం మంచి విషయం కాదు.

ఉద్యమాలు వేరైనా నాయకుల వంచన ఒకటే..చివరికి వాళ్ళు అందరు ఒకటైపోతారు బలయ్యేది సామాన్య ప్రజానీకమే...లగడపాటి మీద కేసు వుండదు...కే. సి. ఆర్ మీద కేసు వుండదు..కాని ఉద్యమం లో పాల్గున్న సామాన్యుల మీద కేసులు వుంటాయి వాటిని వదిలించుకోవటానికి మల్లి ఈ నాయకుల పంచనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

పైన చెప్పినవన్నీ కలిపి చూస్తే రెండు ఉద్యమాల వల్ల ఇప్పటి దాక సామాన్యులకి నష్టమే తప్ప లాభం లేదు...రాజకీయ నాయకుల  కి లాభం తప్ప  నష్టం రాలేదు..కాబట్టి ఉద్యమకారులు మీ నేతలని ప్రశ్నించండి...ప్రజలందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి రాష్ట్రము విభజన కైనా లేక సమైక్యం కైనా...ఇవ్వాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రతినిధులు అలాంటప్పుడు వల్ల ప్రపంచం స్తంభింప చేస్తే వాళ్ళే పని చేస్తారు కదా??


విన్నపం: ఇది నాకున్న అనుమానాల వల్ల కలిగిన అభిప్రాయమే తప్ప...నాకు రెండు ఉద్యమాల వల్ల ఎటువంటి లాభం లేక నష్టం లేదు అలాగని రెండిటి మీద ఒక అభిప్రాయం కూడా లేదు..నా బాధల్లా చేయాల్సిన వాళ్ళని కట్టడి చేయకుండా సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టి, బయట వాళ్ళ ముందు రెండు ప్రాంతాలను చులకన చేస్తున్నారనే...ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి