"హాయ్!! హలో !! నమస్తే!! ఆదాబ్ !! వేల్కం టు చెంప చెళ్ళుమన్నది - సక్సెస్ మీట్ ...................
దీనిని మీకు అందిస్తున్న వారు స్కూటర్ అగర్బత్తి మరియు రావణరాజ్ అడ్డకట్టు పంచలు.
మీరందరు మెచ్చిన అండ్ మీకు నచ్చిన చెంపచెళ్లుమంది పది వేల ఎపిసోడ్ సందర్భంగా మీకోసం ఈ సక్సెస్ మీట్. "
అంటూ గుక్కతుప్పుకోకుండా గాలి పీల్చకుండా ...తాను బట్టల్లో చేసిన పొదుపు మాటల్లో ఏ మాత్రం చేయకుండా మాట్లాడుతున్న యాంకరమ్మ రావమ్మని ఆపమని కెమరామెన్ సంజ్ఞ చేసి పూర్తి బట్టలు వేసుకున్న మగ యాంకర్ పరాదీపుని రమ్మన్నాడు.
"చాలా బాగా మాట్లాడవు రావమ్మా కానీ నాకు పేమెంట్ ఇస్తున్నారు నన్ను మాట్లాడనివ్వు అని" గుసగుసగా మాట్లాడి గుట్టు చప్పుడు కాకుండా రావమ్మకి వార్నింగ్ పరాదీపు నవ్వుతు కెమెరా ముందుకు వచ్చి.
"సూపర్!!! ఇంకా మనం కార్యక్రమం మొదలు పెడదాం! ముందుగా ఈ సీరియల్ లో ప్రతి ఎపిసోడ్ క్రమం తప్పకుండ చెంపచెళ్లుమనిపించుకున్న మన నాయకి "ఏడుపు ఎంకమ్మ"ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం"
"ఏడుపు ఎంకమ్మ" యాంకరమ్మ కురచగా కుట్టించుకోగా మిగిలిన గుడ్దని కూడా తన గౌనుకి కొట్టుకొని మెట్లు ఎక్కటానికి ఆపసోపాలు పడుతూ పైకి వస్తోంటే మన పరాదీప్ పరుగుల మీద వెళ్లి చేయందించి వేదిక మీదకి తెచ్చాడు.
రావమ్మా: "చెప్పండి ఎంకమ్మ గారు అసలు అన్ని చెంపదెబ్బలు తిన్నాక మీ అనుభూతి చెప్పండి"
ఎంకమ్మ: "ముందుగా ఈ సీరియల్ నాకు ఇచ్చిన డైరెక్టర్ జిగురు బాబ్జికి ప్రొడ్యూసర్ పిసినారి పాపికి నా ధన్యవాదాలు. బాబ్జిగారు నాకు ముందే చెప్పారు ఈ సీరియల్ తర్వాత మీరు పెద్ద స్టార్ అవుతారు అని అలాగే ఇప్పుడు ఎక్కడ ఏ ఏడుపుగొట్టు పాత్ర వున్నా మొదట నా దెగ్గరకు వస్తూన్నారు... ఈ మధ్యన మా అయన కూడా ఈ సీరియల్ పుణ్యమా అని కనీసం నీ బుగ్గల వాపుని కండ అనుకోని కొంతమంది నన్ను "మీ ఆవిడకి తిండిపెట్టటం లేదా అని " అడగటం లేదు సంతోషం అంటున్నారు . చాలా ఆనందంగా ఉంది ఇంట్లోవాళ్ళు అంతలా నన్ను మెచ్చుకుంటే. ఈ సీరియల్ తర్వాత నా తెలుగు చాలా బాగయింది. ఇంకా సెలవు . గాడ్ బ్లెస్స్ యు అల్ "
పరాదీప్: "సూపర్!! మరి అయితే ఎంకమ్మ గారు ఈ సీరియల్ లో మీరు ఏడుపుతో ఒక మానరిజమ్ ఫాలో అవుతారు కదా అని ఒక సారి మన ప్రేక్షకుల కోసం చేసిచూపిస్తారా అండ్ అసలు అది ఎలా వచ్చింది మీ ఐడియా నా లేక డైరెక్టర్ గారు చెప్పారా?"
ఎంకమ్మ: " ఒహ్హ్!! నా సిగ్నేచర్ ఏడుపా !! అది నాకు ఇలాగ వెంటనే ఏడుపు రాదు ఎప్పుడు ఏడవాలి అన్న మా డైరెక్టర్ వచ్చి నా జబ్బ గిల్లేవాడు ఆ నొప్పికి నేను జబ్బ రుద్దుకుంటూ ఏడిచే దానిని అదే నా మానరిజమ్ అయిపోయింది " అని నవ్వింది
రావమ్మా: "వ్వావ్ !!! ఎంకమ్మ గారి ఏడుపు రహస్యం మొట్టమొదటి సారి మా ప్రోగ్రాం లోనే చెప్పారు."
ఎంకమ్మ: " జబ్బలు అంటే గుర్తొచ్చింది. మొదట్లో మా ఆయనకి ఈ జబ్బగిల్లుడు తెలియక నాకు కండలు పెరిగాయి అని అనుకునేవాడు తర్వాత ఒక సరి రక్తం కారేసరికి అసలు విషయం తెలిసి రోజు తానే ఇంటి దగ్గర గట్టిగ గిల్లి పంపేవాడు.. ఆ గిల్లుడికి నేను రోజు అంతా ఏడుస్తూ వుండే దానిని. దానినే మా బాబ్జి గారు తీసి సీరియల్ లో పెట్టుకొనే వాళ్ళు. నా "ఏడుపు" బిరుదుకి కారణం మా ఆయనే "
రావమ్మా: " వావ్ !! సో క్యూట్ !! మీరు చాలా లక్కీ !!! ఇప్పుడు డైరెక్టర్ బాబ్జిగారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం"
కూలీల గుంపుకి నాయకుడులాగ మాసిన గెడ్డం ఇరగపెరిగిన జుట్టు సీట్ పట్టనంత కాయం వేసుకొని ఒక విగ్రహం వేదిక మీదకి వచ్చింది
పరాదీప్: " వెల్కమ్ బాబ్జి గారు !! ఎలా అనిపిస్తోంది 10000 ఎపిసోడ్స్ అయ్యాయి జనాలు ఇరగబడి ఏడుస్తున్నారు మీ సీరియల్ చూసి ..."
బాబ్జి: "అందరికి నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి సీరియల్ చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన పాపి గారికి ధన్యవాదాలు. ఆయన అసలు ఎక్కడ ఖర్చుకి వెనకాడలేదు. దాని ఫలితామే ఈ మీట్."
(ఇంకా ఉంది ...)