సమయం: సాయంత్రం 6:15
ప్రదేశం: మా కారాగారం శిఖరాగ్రం (ఆఫీసు పైన ఉన్న ఖాళీ ప్రదేశం)
అప్పటి దాకా మా ఆఫీసువాళ్ళు పెట్టే ఫలహారం తినేసి ప్రశాంతంగా నాగర్జునా ఢాన్సులాగా పడాదామా వద్దా అని వాన ఆలోచిస్తుండగా హాయిగా ప్రకృతి ని ఆస్వాదిస్తున్నాను. ఇంతలో నా సెల్లు నా పరవశానికి భంగం కలిగిస్తూ నా కాలు గడగడ లాడించింది (నిశబ్దంలో పెట్టాను ) ఏ వెధవ సొల్లు చెప్పటానికి చేసాడా అని చిరాగ్గా దాని వంక చూసాను. "వారపు పని చిట్టా" (వీక్లి స్టేటస్ రిపొర్ట్ ) చెప్పటానికి సమయమయ్యింది అని నా సెల్లు గంట మొగించి చెప్తొంది.
నాకు ఎక్కడ లేని బాధ ఇంకా వెంటనే పాకిస్తానుకి కాని తాలిబాను కి గాని వెళ్ళి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక "ఆత్మాహుతి దళ" యెధుడిని తెచ్చి మా క్లయింట్ మీదకి వదలాలి అన్నంత కోపం వచ్చింది. కానీ వాడి ఉప్పు తింటున్నాను అని గుర్తొచ్చి నా మనసుని, దాంట్లో కోపాన్ని "గొద్రేజ్" బీరువాలో దాచేసి "స్వాతిముత్యం" కమల్ హాసన్ నవ్వు ఒకటి మొహాన పులుముకొని "సమావేశపు గదికి"(కాన్ఫరెన్స్ రూమూ) వచ్చాను. అక్కడ పొరాటానికి సిద్దమవుతున్న సైనికుడు తన అస్త్రాలు సరిచూసుకుంటునట్టు మా లీడు "లాపుటాపు" సర్దుతున్నాడు.
ఈ రోజు ఎంతసేపు బుర్ర తింటాడో అని గుండెల్లో భయంగా వున్నా పైకి మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతున్నా. ఇంతలో ఆ శుభగడియలు రానే వచ్చాయి. మా లీడు ఫొను కలిపాడు కాసేపు అర్ధం కాని భాషలో అమ్మనాబూతులు తిట్టించుకున్నాక కొన్ని మీటలు నొక్కితే మా క్లయింటు లైనులోకి వచ్చాడు.
వస్తూవస్తూనే సుడిగాలిని తలపిస్తూ "HOWDY.. HOWDY..." ఒక అరుపు అరిచాడు
దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా పూర్వానుభవం వల్ల వాడు మేము ఎలా వున్నామో అని అడుగుతున్నడు అని అర్ధం చేసుకున్నాము. "బాగానే ఉన్నాము" అని ఆంగ్లంలో చెప్పాము. కానీ మనసులో మాత్రం "మా ఖర్మ కొద్ది నీ దగ్గర పడ్డాము" అని అనుకున్నాను
ఎంతైనా భారతీయులం మన సంస్కారమెలా మర్చిపోతామని "HOW R U *****" అని అడిగాము. దానికి వాడు "SUPERB" అన్నాడు. వెంటనే మాకు మూడింది అని రాత్రికి నిశాచరులని కలవక తప్పదని అర్ధమైపోయింది
జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపొయింది ఇంకా నష్టం జరగకుండా చూడాలి అని వెంటనే నష్టనివారణ చర్యలు మొదలుపెట్టము. వాడికి అవకాశం ఇస్తే ఎక్కడ సొల్లు మొదలు పెడతాడో అని తుపాకి పేల్చగానే పరిగెత్తే ఉసియన్ బోల్ట్ లాగా మా మా లీడు "SHALL WE START WITH PLAN FOR CALL *****" అని అన్నాడు.
క్ల: "SURE........."
వెంటనే మొదటి దశలో సొల్లు తగ్గించిన మా లీడులో నాకు ముక్కొటి దేవతలు మూకుమ్మడిగా కనిపించారు. కాని మనసులో ఏదో మూల పొద్దునే స్కూలుకెళ్ళే పిల్లాడి లాగా నేను నా భుజాన ల్యాపుటాపు సంచి తగిలించుకొని సాయంత్రం 9:00 కి చూడబొయే 2012 ని తలుచుకుంటూ వస్తుండగా పక్కింటాళ్ళ పిచ్చి కుక్క ఎదురింటాళ్ళ నల్ల పిల్లి కలిసి సరదాగా వాకింగు చేస్తూ నాకు ఎదురు వచ్చాయే అయినా వీడు సొల్లు మొదలెట్టలేదు అని ఆనందిస్తుండగా
క్ల: "BUT I WANT US TO DO A SHORT BRAINSTROMING TODAY AFTER UR POINTS........." అన్నాడు
వెంటనే నా ఆత్మారాముడు నిద్రలేచి "ఛీ వెధవా!! జల్సా లో సునీలు లాగ నీకు ఏది సరిగ్గావినే అలవాటు లేదు... నీ ఆత్మారాముడిగా నీ బాధలు భరించలేక పొతున్నా అని నోటికొచ్చినవి కొన్ని రానివి కొన్ని తిట్టేసాడు"
వీడి తిట్ల కంటే మా క్లయింటు తిట్లే మేలు వాడు ఏమి తిట్టినా సగం అర్ధం కావని నా ఆత్మారాముడికి జో కొట్టి వాడి మాటల మీద దృష్టి పెట్టాను.
మా లీడు ఆరంభశూరత్వాన్ని కొనసాగిస్తూ మేమూ ఈ వారము చేసిన పనులన్ని వాడికి ఏకరువు పెట్టుకుంటున్నాడు. సరే ఈ సునామి త్వరలో నా మీదకి వస్తుంది అని బ్యాటింగ్ కి వచ్చేముందు వ్యాయామాలు చేసి దిగినట్టు ఒక్క సారి నేను ఈ వారం చేసినవన్నీ నేమరువేసుకుంటున్నా.. ఈలోగా నా వంతు వచ్చేసింది. నేను అనుకున్నవన్నీ చిన్నప్పుడు పాఠాలు అప్పచెప్పిన అనుభవంకొద్ది గడగడ అప్పచేప్పేసా.
"WELL...I APPRECIATE YOU EFFORTS BUT CAN YOU REPEAT IT ONCE AGAIN" అన్నాడు వాడు.
అరకిలోమీటరు పరిగెత్తి అక్తర్ బంతి విసిరితే అంగుళం కూడా కదలకుండా బంతిని ఆపిన ద్రావిడ్ మీద అక్తర్ కి ఎందుకు కోపం వచ్చిందో నాకు అప్పుడు అర్ధం అయ్యింది. చేసేది లేక నేను నా పాఠం నెమ్మదిగా అప్పచేప్పాను.
"GREAT!!!.." అన్నాడు వాడు
హమయ్య!!! ఈ రోజుకి బ్రతికి పోయాను అని అనుకున్నా మనసులో. మిగితా వాళ్ళ పాఠం వింటుండగా నాకు కాస్త కునుకు పట్టింది. నిద్రపోతుంటే కలలో మా క్లయింటు అరుంధతి లో అఘోరా వేషం వేసుకొని నా బుర్రని సాయంత్రం తిన్న దోసతో నంచుకుతింటున్నాడు. "అయ్య బాబోయ్" అని టక్కున లేచి చూసాను.
మా క్లయింటు అప్పుడే వాడి కాఫీ తెచ్చుకొని మమ్మల్ని ఊరించే ప్రయత్నమో లేక సహజ తత్త్వమో తెలియదు కాని "బొమ్మరిల్లు" హాసిని లాగా గట్టిగా జుర్రుకుంటూ తాగుతున్నాడు. నాకు తిన్న అల్పాహారం అరిగిపోయి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. "నీ కాఫీలో కందిరీగ కూలా అని" మనసులో అనుకుంటూ దీనంగా గడియారం వంక చూసాను. అప్పటికే చిన్న ముల్లు ౩౦ డిగ్రీలు తిరిగేసింది(గంట గడిచింది అని నా కపిహృదయం ) ఇంకా వదలట్లేదు.
అప్పటికే అందరు ఏమి చేసారో ఏమి చేయబోతున్నారో చెప్పేశారు ఇంకా వెళ్ళచ్చు అనుకుంటుండగా "OK now lets start brainstroming on %^*(@@^&!&!**@^@#%#^&" ఐదు నిముషాలు ఊదరగొట్టి "LETS SHARE OUR VIEWS" అన్నాడు .
మనకి ఇచ్చిన అంశం మీద అవగాహన వున్నా లేకున్నా మాట్లాడటం "గుంపు సంభాషణలలో"(గ్రూపు డిస్కషన్) అలవాటే కాబట్టి ఉత్సాహం ఆపుకోలేక "IN MY VIEW....." అని ఏదో వాగేశా.
"YEAH THATS AN EXCELLENT THOUGHT BUT HOW CAN THIS FIT....." అంటూ దొరికారురా ఇంకా నాకు "నిన్ను వదల బొమ్మలి వదలా" అని వాడి స్టైల్ లో వాడు బుర్రలో గుజ్జు తాగే కార్యక్రమంలో మునిగిపోయాడు.
పొద్దున్న కనిపించిన పిల్లి కుక్క గుర్తొచ్చి ఇంకో ఇద్దరు యోధుల్ని కూడా కొనాలి వాటికోసం అని అనుకుంటూ చుట్టూ చూసాను. అందరు నా వంక వాడి మానన వాడు ఏదో చెప్తుంటే ఎందుకురా నువ్వు మధ్యలో మాట్లాడవు (మరీ ఇంత సాత్వికం గా కాదు కాని అన్ని రాస్తే బాగోదు అని రాయట్లేదు) అనట్టు చూస్తున్నారు.
ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా సరే సమరసింహారెడ్డి సినిమా లాగా నన్ను చంపటానికి ఎక్కడ స్కుటీలు, పాషను ప్లస్సులు వేసుకొని ఎక్కడ తరుముతారో అని భయం వేసి మా లీడు వంక "అన్యదా శరణం నాస్తి" అనట్టు చూసాను.
దానికి మా లీడు నాకు పాంటు షర్టు వేసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా వంక భయపడకు అని చెప్పి
"ACTUALLY ***** the intention was like #!$$%%@^&!*!" అని ఏదో సర్ది చెప్పాడు.
అలాగా చిన్న ముల్లు ఇంకో 30 డిగ్రీలు తిరిగే దాకా వాడు బుర్ర తిని వదిలితే చావు తప్పి కన్నులోట్టపోయింది లే ఫర్వాలేదు అనుకుంటూ సినీమా కి పరుగులు తీశాను.
ఇదండీ మా క్లయింటుతో నేను పడ్డ పాట్లలో ఒకటి.
నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2009-11-19
2009-11-13
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
బుడి బుడి అడుగులు ముద్దుముద్దు మాటలు
గాడిద బరువులు చదువుల బాధలు
కొతికొమచ్చి ఆటలు బాటు కోసం ఫైట్లు
స్నేహితుల ముచ్చట్లు పరీక్షల అగచాట్లు
ఒంటిపూట బడులు వణికించే పంతుళ్ళు
వేసవి సెలవలు ఊళ్ళొ పోలాలు
కక్కిన పెన్నులు చిరిగిన బ్యాగులు
ఇవేలే కళ్ళలో మెదిలే బాల్యస్మృతులు
గాడిద బరువులు చదువుల బాధలు
కొతికొమచ్చి ఆటలు బాటు కోసం ఫైట్లు
స్నేహితుల ముచ్చట్లు పరీక్షల అగచాట్లు
ఒంటిపూట బడులు వణికించే పంతుళ్ళు
వేసవి సెలవలు ఊళ్ళొ పోలాలు
కక్కిన పెన్నులు చిరిగిన బ్యాగులు
ఇవేలే కళ్ళలో మెదిలే బాల్యస్మృతులు
2009-11-11
ఏక్ నిరంజన్ పారడి
హైకూ లేదు గిఫ్తు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేళకి ఇంటికి వెళ్లే యోగం లేదు ఏక్ నిరంజన్...
జావా రాదు... నాకు జే.స్.పి రాదు.
.నెట్ రాదు నాకు సీ# రాదు
ప్రోగ్రామింగ్ రానే రాదు,అప్రిసియేషన్ లేవులే,
ఆన్‌సైట్ చాన్సే లేదు,ప్రమోషన్ లేదులే.
సర్చింగ్ లో కింగ్ నే , నా లోకమే గూగులే..
వర్కున్నా, లేకున్నా నేనెప్పుడూ ఎహె కాంటీన్‌లో ఉంటానే..

కేర్ ఆఫ్ క్యాంటీన్, ప్రాడక్ట్ అఫ్ బెంచ్ అవారా డాట్ కామ్.
ఏ ధమ్లో ధమ్ టన్స్ ఆఫ్ కాఫీ మనకదే గా ప్రాబ్లమ్.
అరె ప్రాజెక్ట్ పేరే తెలియదే, నాకు కోడింగ్ ఏ రాదే.
ఏ టి . ఎల్ , లీడు లేరులే.. న మెయిల్స్ ఏవో నావే...
వాచ్చావా చేశావా అని అడిగేదియేవ్వడులే. .
ఔటింగ్లు పార్తీలు అని పిలిచేవాడు ఎవ్వడే. .

వర్కున్నా, లేకున్నా నేనెప్పుడూఎహె కాంటీన్‌లో ఉంటానే..
హెడ్ ఇస్ ఏకింగ్,అండ్ ఇట్స్ బ్రేకింగ్ ఖాళి ఐతే అంతే,
దాట్స్ ఒకే యార్ ఛల్తా హై, ఐ హ్యావ్ ఏ శారిడాన్..
ఓ పనికి మలిన ప్రాజెక్ట్స్ కాల్స్ చేస్తాయి లే..
మన స్టైల్ లో మనమే రిజెక్ట్ చేస్తామే.
ఇవ్వాళో రేపో లా మన బ్రతుకు ఉందే..
తీసేస్తే ఇంకో కంపనీ ఉండనే ఉందే...

గమనిక: ఇది నేను రాసింది కాదు నాకు ఎవరో పంపితే బాగుందని నా బ్లాగు లో రాశాను

2009-11-04
సుబ్బిగాడు vs సుబ్బలక్ష్మి -3
అలా సుబ్బిగాడు పెళ్లి చెడగొట్టుకోటానికి... సుబ్బలక్ష్మి ఎలాగన్నా ఈ పెళ్లి ఖాయము చేసుకోవాలి అని... రకరకాలుగా కృషి చేస్తున్నారు. ఈ ఆలోచనల మధ్యన పొద్దునే లేచి బ్యుటీ పార్లర్కి వెళ్ళి అందంగా తయారయ్యి పెళ్ళిచూపులకి సమయం మించి పోతోంది అని సుబ్బలక్ష్మి వేగంగా ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో మన సుబ్బిగాడు అందంగా తయారయ్యి తన బైక్ వేసుకొని వేగంగా వస్తున్నాడు. మరుసటి రోజు పండుగ వల్లో లేక ఇంట్లో పెళ్ళాం తరిమేయటం వల్లనో కానీ మన సుబ్బిగాడి దశ బాగోక అదే సమయానికి అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబులు జంక్షను దగ్గర నిల్చోని బైక్‌లు ఆపుతూ మామూలు వసూలుచేస్తున్నాడు. మన సుబ్బిగాడు పెళ్ళిచూపులకి వెళ్తున్నాను అక్కడ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో?? తనని వద్దని ఏవంక పెట్టాలో?? అన్న ఆలోచనలలో పడి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ని గుర్తించలేదు. అలా తన ఆలోచనలలో ఉండిపోయి రోడ్డుకి అడ్డంగా నిల్చుని మామూలు వసూల్చేస్తున్న కానిస్టేబుల్ని గుద్దెశాడు .
గుద్డాక సుబ్బారావు ఊహాలోకంనించి తేరుకొని జరిగింది ఏమిటా? అని ఒక సెకను ఆలోచించు "అయ్యా బాబోయ్!!!!" అని గావుకేక పెట్టాడు. ఆ కేక కి కింద పడ్డ కానిస్టేబుల్ కి ఏమైందో అని భయం వేసి నేలకి కరుచుకొని పోయాడు. ఇద్దరిలో మొదట తేరుకున్న సుబ్బారావ్ ఇంకా అక్కడే ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని గ్రహించి తన బైకుని వాయువేగంతో ముందుకి ఉరికించాడు. అక్కడికి కొంచెం దూరంలో హడావిడిగా ఇంటికి వస్తున్న సుబ్బలక్ష్మి ఈ సంఘటనంతా చూస్తూనే ఉన్నది. "ఫర్వాలేదు..గురుడు ముదురే" అని మనసులో అనుకోని నవ్వుకుంటూ ఇంటికి వెళ్దాము అనుకుంటుండగా తనకి ఒక్క ఆలోచన వచ్చింది అనుకున్నదే తడవుగా ఆచరించటం మొదలు సుబ్బారావు ఎంతో దూరం వెళ్లలేదు ఆ సందుచీవరనే ఇంటి అడ్రెస్ తెలియక ఎవరిని అడగాలా అని చుట్టుచూస్తున్నాడు. ఇంత పొద్దున ఎవరు రోడ్డుమీదకు వస్తారు ఏమీ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సుబ్బారావు.
"దేని కోసం అన్న వెతుకుతున్నారా" అంటూ అడిగింది సుబ్బారావుని.
అప్పటికే గాలి ఆడని ఆస్త్మా పేషెంట్లాగా కొట్టుకుంటున్న సుబ్బారావు కి సుబ్బలక్ష్మి ముఖానికి గుడ్డ కట్టుకున్న అదృష్టదేవతలాగా అనిపించింది. సుబ్బలక్ష్మి చలికి జలుబు చేయకుండా ముఖానికి గుడ్డ కట్టుకుంది. కేవలం తన కళ్ళు మాత్రమే బయటకి ఉండేట్టు ముఖానికి చున్ని కట్టెసుకుంది.
"ఇక్కడ వామనరావుగారి ఇల్లు మీకు తెలుసా?" అని అడుగుతూ గతరాత్రి తీసిన అడ్రెస్ ప్రింట్ అవుట్ ఆమె చేతిలో పెట్టాడు.
ఒక రెండు నిముషాలు మనసులో తాను చేసే పని తలుచుకొని నవ్వుకుంటూ "ఓ ఆయన ఇల్లా మీరు తప్పు సందు తిరిగారు. మీరు ఇందాక ఒక చౌరస్తా దాటి వచ్చారు కదా దాని దగ్గర కుడివైపుకి తిరగండి..." అంటూ తన ఇంటికి రావటానికి ఇంకో దోవ చెప్పింది. మామూలుగా వాళ్ల ఇంటికి వెళ్ళాలి అంటే ఒక 200 అడుగులు ముందుకి వెళ్తే సరిపోతుంది.
సుబ్బారావుకి చౌరస్తా అని చెప్పగానే ముందుగా తాను గుద్ది వచ్చిన కానిస్టేబులు గుర్తువచ్చి టక్కున "ఇంకో దోవ ఏమీ లేదా" అని నీరసంగా అడిగాడు.
సుబ్బలక్ష్మి తనలో తాను నవ్వుకుంటూ ఉంది కానీ దానికి మీరు మా ఇంటికి ఒక సారి రావాలి అని అన్నది. ఆ అమ్మాయి ఇంటికి తన అడ్రెస్ కి సంబంధం ఏంటో తెలియక వెర్రి చూపులు చూస్తుండగా అతని అవస్థ అర్ధం చేసుకున్న సుబ్బలక్ష్మి"భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ కిడ్నాప్చేయను ఆ ఇంట్లో నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి ఉంటుంది ఈ రోజు దాని పెళ్లి చూపులు నన్ను కూడా రమ్మంది మీరు అటే వెళ్తాను అంటున్నారు కాబట్టి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యీ మీతో పాటు వస్తాను మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నది.
సుబ్బారావుకి ఏమీ చేయాలో ఏమీ చెప్పాలో తోచలేదు. ఎదురుగా అమ్మాయి తనతో వస్తాను అంటోంది. అక్కడ వెళ్లేది పెళ్ళిచూపులకి అమ్మాయితో వెళ్తే ఏమీ అనుకుంటారో? అని అనుకుంటూ "సరే పదండి" అంటూ ఆమె బండి వెనకాలే వెళ్లాడు.
"అవును మీకు ఆ ఇంటితో పని ఏంటి??" అని అడిగింది సుబ్బలక్ష్మి.
"అది నేను మీ ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తున్నాను" అని చెప్పి సుబ్బలక్ష్మి రియాక్షన్ కోసం ఆమె వంక చూసాడు సుబ్బారావు
"ఓ సుబ్బులుని చేసుకోబోయేది మీరేనా..." అంటూ నవ్వేసింది
"చేసుకోబోయేది" అన్న మాట వినగానే సుబ్బారావుకి పిడుగు పడట్టు అయ్యింది "అదేంటి అలగానేశారు నేను జస్ట్ చూడటానికే వెళ్తున్నది " అని అన్నాడు.
"అంటే మా సుబ్బులుకి మీరు ఆల్‌రెడీ తెగ నచ్చేశారంట అది మిమ్మల్నే చేసుకోవాలి అననుకుంటోంది" అని చెప్పింది సుబ్బలక్ష్మి
"ఆమెకి నచ్చితే చాలా నాకు నచ్చాకర్లేదా??" అని కోపముగా అన్నాడు
"అరే అలా అని కాదు ఏదో దానికి నచ్చారు కదా అని " అని ఏదో అనబోతుంటే.
"తనకి నచ్చినా నచ్చక పోయినా నేను ఒప్పుకునేది లేదు" అని ఖరాఖండిగా చెప్పేసాడు సుబ్బిగాడు.
"అదేంటి అంత మాట అనేశారు చూడకుండానే" అని షాక్ లో బండి ఆపేసింది సుబ్బులు
సు. రా: "ఏంటి అంటే నా ఇబ్బందులు నాకు ఉన్నాయి"
సు. ల: "మరి మీరు పెళ్లి చూపులకి ఎందుకు వస్తున్నారు"
సు.రా: "అది ఒక పెద్ద కధలెండి ఇప్పుడు మీకు చెప్పెంత టైంలేదు పైగా మీకు నేను ఎందుకు చెప్పాలి?"
సు.ల: "పర్వాలేదు చెప్పండి నేను కావాలి అంటే మా సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి పెళ్ళిచూపులు లేట్ అవుతాయి మీరు నాతోనే ఉన్నారు అని చెప్తాను"
సు.రా: "అసలు మీరు నాకు ఇప్పుడే పరిచయం మీకు నేను ఎందుకు చెప్పాలండి"
సు.ల: "మీరు నాకు అది చెప్తే నెను మీకు సుబ్బలక్ష్మి గురించి చాలా పెద్ద సిక్రెట్ చెప్తాను"
వెంటనే సుబ్బారావు "ఇదేదో బాగనే వుందే నా ఇబ్బంది చెప్తే నాకు వచ్చే నష్టం ఏమి లేదు కాని తన గురించి నాకు ఎంత తెలిస్తే వద్దనటానికి అంత సులభం అవుతుంది" అని మనసులో అనుకోబోయి కొంచెం గట్టిగానే అనేసాడు.
"పడ్డాడు మన వలలో పడ్డాడు" అనుకుంది సుబ్బలక్ష్మి
సు.రా: "సరే మీరు మాట మీద నిలబడాలి" అన్నడు
సు.ల: "తప్పకుండా" అన్నది
ఆ ఇబ్బంది ఏంటో త్వరలో మీ ముందుకి తెస్తాను అప్పటి వరకు సెలవు..:)

Subscribe to:
Posts (Atom)