చిన్నప్పటి నించి మనకి మన పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు. ఉదాహరణకి పగిలిన అద్దంలో తల దువ్వకూడదు, రాత్రిళ్ళు గోళ్ళు తీయకూడదు ఇలాగ. కాని ఎందుకు అని అడిగితే మాత్రం చాలావరకు "అది మన ఆచారం" అనో "అది అంతే" అనో సమాధానం వస్తుంది. నాకు ఇది నచ్చక నేనే సమాధానం వెతకటం మొదలు పెట్టాను. ఇవి కేవలం నా ఊహాజనిత కారణాలే నిజమైన కారణాలు అవచ్చు కాకపోనువచ్చు.
ఈ మధ్య వరకు నేను మన పూర్వికులు ఈ కట్టుబాట్లు ఆచారాలు అసలు ఆలోచించకుండా అప్పటి వ్యవస్థ తగట్టు పెట్టారు అని అనుకున్నాను కాని ఈ మధ్యనే మా నాన్నగారు ఏదో ఒక సందేహం నివృత్తి చేసుకుందాము అని "పరాశర స్తుతి" అంతర్జాలం లో వెతికి పెట్టమన్నారు. ఎంత వెతికినా దాని ఆంగ్ల అనువాద ప్రచురణ మాత్రమే దొరికింది. నేను అందులో ఒకేఒక భాగము చదివాను ఆ భాగము ఒక మనిషి పోతే ఎన్ని రోజులు మైలు పట్టాలి అన్నదాని మీద అది చదివాక వాళ్ళ ఆలోచనలు నాకు చాలా బాగా అర్ధం అయ్యాయి.
ఆ గ్రంధం ప్రకారం ఎవరు ఎలా పోయిన ఇన్ని రోజులు అని లేదు. మనిషి జబ్బు వాళ్ళ పోతే ఇన్ని రోజులు, విషప్రభావం తో పోతే ఇన్ని రోజులు ఇలా రాసి ఉంది. దాని బట్టి నాకు ఏమి అర్ధం అయ్యింది అంటే మైలు అన్నది వాళ్ళు పెట్టింది ఆ చావు వల్ల వచ్చిన హానికరమైన పదార్దాలు/క్రిములు ఎక్కువమందికి పాక కుండ వుండాలి అని ఇలాంటి కట్టుబాటు పెట్టారు అని అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదని.
ఇంకా పరాశర మహాముని మైలు లో ఇచ్చిన సవరణలు చదివాక నాకు వాళ్ళ దూరాలోచన ఏంటో తెలిసింది. అందుకే ఏమో పెద్దలు అంటారు "పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట" అని. కాని ఒకింత బాధగా అనిపించింది ఇంత బాగా ఆలోచించి ఆయన రాస్తే దానిని తరతరాలుగా మార్చేస్తూ వచ్చి దానికి విలువలేకుండా చేస్తున్నందుకు :( . ఆ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీకు ఏముంది అన్నది వివరంగా మళ్లీ రాయాలి అనుకుంటున్నాను ఈ లోపు మీకు ఓపిక తీరిక ఉంటే మీరే చదువుకోండి మీకు అర్ధం అవుతుంది అయన ఎంత బాగా ఆలోచించారో!!!
నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2010-11-18
2010-11-02
దీపావళి నిజంగా కాలుష్యం చేస్తుందా??
చాలా మంది మిత్రులు దీపావళికి మనం కాల్చే టపాసుల వలన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం జరుగుతాయి అని కాబట్టి దీపావళికి టపాసులు కాల్చొద్దు అని నాకు చెప్పారు. నేను చాలా ఆలోచించగా నాకు అనిపించినా కొన్ని విషయాలు చెప్దాము అని ఈ టపా రాస్తున్నాను. పాతకాలం లో దీపావళికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు టపాసులు చేసుకొనే వారని మా నాన్న చెప్తుంటారు. అప్పుడు ఇంటిలో చేసే టపాసులు అంత హానికరమైనవి చేయరు. మన ఇళ్ళలో పెద్దవాళ్ళకి తెలుసు ఏదైనా ఎక్కువ చేయకూడదు అని. అందుకే ఎక్కువ శబ్దం రాకుండా తయారు చేస్తారు.
అందుకే పూర్వం దీపావళి పండగ చాలా బాగా జరిగేవి వెన్నముద్దలతో, సిసింద్రిలతో, ఇంకా మా నాన్న చాలా చెప్తారు కాని నా బుర్రలో ఈ రెండే మిగిలాయి. ఏ టపాసులోనైనా మూడు రసాయనాలు వుంటాయి ఇంకా ఎక్కువ వుంటే అవి రంగులకోసమో, శబ్దం కోసమో, లేక రకరకాల ఆకారాలకోసమో కలుపుతారు. ఆ మూడు రసాయనాలు వల్ల వాతావరణానికి హాని కలిగించనివి అయితే చాలు మనం కాలుష్యం చేయనట్టే.
శబ్దకాలుష్యం కేవలం పెద్ద బాంబుల వల్లనే కలుగుతుంది చిన్నచిన్న బాంబులు నిర్దేశిత శబ్ద ప్రమాణాలలోనే పేలతాయి. ఇక వాయు కాలుష్యాన్ని ఆపటానికి రంగులు వచ్చే వాటి జోలికి పోకుండా వెళ్తే చాలు చాలా కాలుష్యం తగ్గించిన వారవుతారు.
దీపావళి నాడు టపాసులు కాల్చేది కేవలం పండుగకోసం మాత్రమే కాదు వానల వల్ల బాగా పెరిగిపోయిన దోమలని చంపటానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆఖరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, డాబుకి పోకుండా మతాబులు, కాకరపువత్తులు, చిచ్చుబుడ్డులు, భుచక్రాలు ఇంకా ఇలాంటి చిన్నచిన్న వాటితో దీపావళి జరుపుకోండి మీ జేబుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Subscribe to:
Posts (Atom)