చాలా మంది మిత్రులు దీపావళికి మనం కాల్చే టపాసుల వలన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం జరుగుతాయి అని కాబట్టి దీపావళికి టపాసులు కాల్చొద్దు అని నాకు చెప్పారు. నేను చాలా ఆలోచించగా నాకు అనిపించినా కొన్ని విషయాలు చెప్దాము అని ఈ టపా రాస్తున్నాను. పాతకాలం లో దీపావళికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు టపాసులు చేసుకొనే వారని మా నాన్న చెప్తుంటారు. అప్పుడు ఇంటిలో చేసే టపాసులు అంత హానికరమైనవి చేయరు. మన ఇళ్ళలో పెద్దవాళ్ళకి తెలుసు ఏదైనా ఎక్కువ చేయకూడదు అని. అందుకే ఎక్కువ శబ్దం రాకుండా తయారు చేస్తారు.
అందుకే పూర్వం దీపావళి పండగ చాలా బాగా జరిగేవి వెన్నముద్దలతో, సిసింద్రిలతో, ఇంకా మా నాన్న చాలా చెప్తారు కాని నా బుర్రలో ఈ రెండే మిగిలాయి. ఏ టపాసులోనైనా మూడు రసాయనాలు వుంటాయి ఇంకా ఎక్కువ వుంటే అవి రంగులకోసమో, శబ్దం కోసమో, లేక రకరకాల ఆకారాలకోసమో కలుపుతారు. ఆ మూడు రసాయనాలు వల్ల వాతావరణానికి హాని కలిగించనివి అయితే చాలు మనం కాలుష్యం చేయనట్టే.
శబ్దకాలుష్యం కేవలం పెద్ద బాంబుల వల్లనే కలుగుతుంది చిన్నచిన్న బాంబులు నిర్దేశిత శబ్ద ప్రమాణాలలోనే పేలతాయి. ఇక వాయు కాలుష్యాన్ని ఆపటానికి రంగులు వచ్చే వాటి జోలికి పోకుండా వెళ్తే చాలు చాలా కాలుష్యం తగ్గించిన వారవుతారు.
దీపావళి నాడు టపాసులు కాల్చేది కేవలం పండుగకోసం మాత్రమే కాదు వానల వల్ల బాగా పెరిగిపోయిన దోమలని చంపటానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆఖరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, డాబుకి పోకుండా మతాబులు, కాకరపువత్తులు, చిచ్చుబుడ్డులు, భుచక్రాలు ఇంకా ఇలాంటి చిన్నచిన్న వాటితో దీపావళి జరుపుకోండి మీ జేబుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
chala bagunai nee posts
ReplyDelete