కారుమబ్బులు కమ్ముతున్న సమయం..కుమార్ ఆకాశాన్ని పట్టించుకొనే పరిస్థితిలో లేడు. తన ముందిప్పుడు రెండే మెదులుతున్నాయి. ఒకటి తనను ఇంతటివాడిని చేసిన తల్లిదండ్రులు రెండు తను ప్రేమించిన సరోజ. వాళ్ళలో ఎవరిని వదులుకోలేడు కాని ఇద్దరు ఉండే దారి కనపడట్లేదు. చాలా రోజులనించి ఈ సమస్య పరిష్కారం కోసం అలోచించి ఇంకా ఆలోచించలేక ఏ సమాధానం దొరకక తన చావుతో సమస్య పరిష్కరిద్దాము అన్న నిర్ణయానికి వచ్చి దగ్గరలో ఉన్న నిర్జన కొండమీద పురుగుమందు తాగటానికి నిర్ణయించుకున్నాడు.
కొండ మీద కి వెళ్లి కూర్చొని ఒక్క సారి తన వారితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. ముందుగానే కొని తెచ్చుకున్న శీతల పానియము, పురుగుల మందు డబ్బాలు పక్కన పెట్టి ఇంటికి కాల్ చేసాడు. ఫోన్ ఎత్తిన అమ్మతో "హలో అమ్మా" అని ఉబికివస్తున్న బాధని దిగమింగుతూ మాట్లాడుతున్నాడు.
"హలో కుమార్ ఏమైందిరా ఎందుకు అంత బాధ పడుతున్నావ్" కంగారుగా అడిగింది అమ్మ. తను ఏడుస్తున్న విషయం అమ్మకి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూనే ఇంకా ఏడుపు ఆపుకోవటం తనవల్ల కాక పెట్టేసాడు కుమార్.
ఎంత సేపు ఏడిచాడో తెలియదు కళ్ళు తుడుచుకొని మళ్ళి ఇంటికి కాల్ చేద్దాము అని ఫోను తీసాడు. ఈ లోపు ఇంటినించి పదిసార్లు కాల్ వచ్చింది అని తను ఎత్తలేదు అని చూసి వాళ్ళకి కాల్ చేసాడు. ఈ సరి ఫోన్ నాన్న ఎత్తారు "ఏమైందిరా ఎక్కడున్నావ్" అడిగారు నాన్న
"నాన్న నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను" అన్నాడు కుమార్
నా: "ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు"
కు: "నన్ను చెప్పనివ్వండి నాన్న. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను. అలాగని మిమ్మల్ని వదులు కోలేను. నా వల్ల కావట్లేదు నాన్న నేను ఇలాగ రెండిటి మధ్యన ఉండలేక పోతున్నా " గబగబా చెప్పేసి బోరున ఏడ్చేసాడు.
నా: ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు ఏమి చేసుకుంటున్నాడో ఏమో అని భయాన్ని ఒక పక్కన దాచి ధైర్యం నటిస్తూ "అవన్నీ మనం మాట్లాడదాం ముందు నువ్వు ఎక్కడున్నావ్? సెలవ పెట్టి ఇంటికిరా. ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడదాం"
కు: అతి కష్టం మీద మాటలు పలుకుతూ గుండె వేగం బాగా పెరిగిపోయింది...కళ్ళు ఏడ్చి ఏడ్చి చింత నిప్పులలాగా వున్నాయి..తన శరీరం మీద చీమలు పాకుతున్న గుర్తించలేని స్థితిలో వున్నాడు.."లేదు నాన్న నేను ఇంకా ఇంటికి రాను నా వల్ల కాదు ఇంకా ఈ నరకం అనుభవించటం..మీకు మీ పరువు ప్రతిష్టలు కావాలి..తనకి నేను కావాలి ..నాకు మీరిద్దరూ కావాలి ..మీరు తనని ఒప్పుకోలేరు... ఈ సమస్య ఎప్పటికీ తీరదు నాన్న"
నా: "నువ్వు చాలా కోపం లో వున్నట్టు వున్నావ్ ముందు ఎక్కడ ఉన్న ఇంటికి రా మనం కూర్చొని ఆలోచిద్దాము" ఏదో పిచ్చి పని చేయబోతున్నాడు అని అర్ధం అయ్యి గొంతులో ఆ భయం తెలుస్తోంది.
కు: "నాన్న మీరు నాకు చాలా చేసారు నేను అడిగిందల్లా ఇచ్చారు. ఆ అమ్మాయి విషయంలో ఎందుకు నాన్న అంత పట్టుదల మీకు??"
నా: "ఆ అమ్మాయి విషయంలో పట్టుదల ఏమి లేదు రా నాకు నీ వెనుక మీ చెల్లి ఉంది ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే సమాజంలో మనం తలఎత్తుకోగాలమా??సమాజం సంగతి వదిలేయి ఆ అమ్మాయితో మేము కలిసి ఉండలేము రా....నేను ఈ ఊరిలో నా చిన్నప్పటి నించి ఉంటున్నా ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే నేను ఇంకా ఇక్కడ ఉండలేను వేరే ఊరు వెతుకోవలిసిందే "
కు: "ఇంకా మీకు ఆ కష్టం వుండదు నాన్న ఈ రోజుతో మీరు నా గురించి ఆలోచించకర్లేదు...ఒక వేళ మీరు ఆలోచించినా అది తెలుసుకొనే పరిస్థితిలో నేను ఉండను..నాన్న మీరు నాకు ఎంతో చేసారు దాని ఋణం నేను ఎప్పటికి తీర్చుకోలేను.."
ఇంకా మాట్లాడలేక ఫోను కట్ చేసేసాడు కుమార్.
తనలో ఎన్నో ఆలోచనలు...చాలా భయం...అలాగే చాలా ధైర్యం...రెండు ఒకే సారి ఎలా వున్నాయో అర్ధం కాకుండా వుంది...ఒక క్షణం ఎంతో ధైర్యంగా అనిపిస్తోంది ఇంకొక క్షణం అయినవాళ్ళు గుర్తొచ్చి భయం వేస్తోంది....తను ఇన్నాళ్ళు సమాజం ముందు భయపడి ఆపుకున్న కన్నీళ్ళంతా ఒక్క ఉదుటున తన కంట్లోనించి రాలుతున్నాయ్...అలా ఏడుస్తూ ఎంతసేపు అక్కడ ఉన్నాడో తనకే తెలియదు...సెల్లు వంక చూస్తే ఇంటి నించి చాలా కాల్స్ వచ్చాయి. మళ్ళి వాళ్ళకి కాల్ చేసే ధైర్యం లేదు...అందుకే ఇంక సరోజకి చేద్దాం అని నిర్ణయించుకున్నాడు.
స: "హలో"
కు: " హాయ్ సరోజ...ఎక్కడున్నావ్??" సాద్యమైనంత దైర్యం నటిస్తూ మాట్లాడుతున్నాడు కుమార్
స: "రూములో వున్నాను...ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు పొద్దున్న...మీ రూమ్మేట్ కి కాల్ చేస్తే పొద్దునే బయటకి వెళ్ళాడు అని చెప్పాడు"
కు: " సరోజా నువ్వంటే నాకు చాలా ఇష్టం..నువ్వు లేకుండా నేను బ్రతకలేను"
స: "నాకు కూడా నువ్వంటే ప్రాణంరా...ఏంటి ఇప్పుడు సడన్ గా ఈ మాటలు ఎందుకు...ఏమైంది అసలు ఎక్కడున్నావ్"
ప్రాణం అన్న మాట వినగానే మళ్ళి కుమార్ కళ్ళలో నీళ్ళు తిరగడం మొదలైంది...
కు: " నేను చెప్పేది ఎదురు ప్రశ్న వేయకుండా విను...నీ లాంటి మంచి దానికి, అందగాత్తెకి నాకంటే చాలా మంచి కుర్రాడు దొరుకుతాడు. నేను నీకు సరిపోనురా..."
స: "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు...అసలు ఏమైంది...నువ్వు కాకుండా నేను ఎవరిని చేసుకోనని చెప్పాను కదా...అసలు ఏమి జరిగింది చెప్పు ? ఎక్కడ వున్నావ్??"
సరోజకి అంతా అయోమయంగా భయంగా వున్నది... తన్నుకు వస్తున్న దుఃఖాన్ని తన స్నేహితులకి తెలియకుండా ఆపటం చాలా కష్టం గా వుంది...చకచకా మేడమేట్లు ఎక్కుతోంది.
కు:" సరు(సరోజ ముద్దు పేరు) నేను చెప్పేది విను..మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు...మీ ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు...మన వాళ్ళని కాదని పెళ్ళిచేసుకోవడం మన ఇద్దరికీ ఇష్టం లేదు...ఈ పరిస్థితుల్లో మన పెళ్లి అవ్వటం అసంభవం..."
స: "మన పెద్దవాళ్ళని మారుద్దాం రా...వాళ్ళు మారతారు ఖచ్చితంగా...నిన్ను కాదు అని నేను ఎవ్వరిని చేసుకోనని చెప్పేసాను ఇంట్లో...చేసుకోను కూడా...ఎంతకాలమైనా పర్లేదు ఎదురుచూద్దాం...వాళ్ళని ఒప్పిద్దాం...అసలు నువ్వు ఎక్కడున్నావ్ అది చెప్పు ముందు.."
కు: "వాళ్ళు మారరురా...నాకు ఆ ఆశ చచ్చిపోయింది...అందుకే నేను కూడా చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నా"
సరోజకి గుండె ఆగినంత పని అయ్యింది...ఏమి చెప్పాలో తెలియదు...తన ఇంట్లో వాళ్ళ తర్వాత తనని అంతలా అర్ధం చేసుకున్న వ్యక్తి కుమార్...తనతో జీవితం పంచుకోవాలి అనుకుంది...గత రెండు సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఈ విషయం మీద...ఈ సంఘటనలు అన్ని ఒక్క రెండు సెకనులలో తన మదిలో తిరిగాయి...కుమార్ లేని తన జీవితం ఊహించటం కూడా అసాధ్యం తనకి...ఇప్పుడు తను కుమార్ ని ఆపాలి...తను కుమార్ ఇలాంటి పని చేస్తాడు అని కూడా అనుకోలేదు...ఎన్నో సార్లు తను భయపడి చనిపోదాము అనుకున్నా కుమార్ చక్కగా తన మాటలతో సముదాయించి ఆ ఆలోచనలు రాకుండా చేసేవాడు...అలాంటి కుమార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు...తనకి వున్న బలం కుమార్ తన బలహీనత కూడా కుమారే...కుమార్ కి ఏమన్నా చిన్న దెబ్బ తగిలినా సరోజ విలావిలాడిపోతుంది. తను తుమ్మగానే డాక్టర్ ని కలిసే దాక బుర్ర తినేస్తుంది...అట్లాంటిది కుమార్ చెప్పింది విన్నాక తన కాళ్ళ కింద నెల కదిలిపోయినట్లు అనిపించింది...ఎలాగైనా కుమార్ ని రక్షించుకోవాలి అనుకుంది కాని ఎలాగా అన్నది అర్ధం కావటం లేదు.
కు: "సరోజ వింటున్నావా" అటునించి సమాదానం రాక పోయే సరికి అడిగాడు కుమార్. కుమార్ కూడా సరోజ గురించి ఆలోచిస్తున్నాడు. తను ఇలా చెప్పటం సరోజాకి చాలా బాధ కలిగిస్తుంది అని తెలుసు కుమార్ కి. కాని తనకి ఇంతకంటే మంచి పరిష్కారం కనిపించలేదు.
కు: "సరోజ వింటున్నావా" అటునించి సమాదానం రాక పోయే సరికి అడిగాడు కుమార్. కుమార్ కూడా సరోజ గురించి ఆలోచిస్తున్నాడు. తను ఇలా చెప్పటం సరోజాకి చాలా బాధ కలిగిస్తుంది అని తెలుసు కుమార్ కి. కాని తనకి ఇంతకంటే మంచి పరిష్కారం కనిపించలేదు.
స: "విన్నాను కాని నేను విన్నది నమ్మబుద్ధి కావట్లేదు...నువ్వేనా ఇలా మాట్లాడింది...ఇలాంటి నిర్ణయం తీసుకొనే ముందు నాకు ఒక్క సరి చెప్పాలి కదా...నీ కోసం నేను అన్ని వదులుకొని వచ్చేస్తానురా...నువ్వు అలాంటి పనులు ఏమి చేయకు...ఎక్కడ ఉన్నవో చెప్పు ముందు ...అసలు చావే దేనికి పరిష్కారం అయితే నేను కూడా వస్తాను నీకు తోడుగా ...ఇక్కడ ఎటు నీ తోడూ కాలేక పోతున్న కనీసం చావులో అవుతాను...ప్లీజ్ చెప్పవా"
ఏమి మాట్లాడుతోందో తనకి తెలియట్లేదు మదిలో మెదిలిన ప్రతి ఆలోచన అలాగా చెప్పేస్తోంది సరోజ...తనకి ఏడుపు వస్తోంది...కళ్ళ వెంట నీళ్ళు జలపాతం లాగా కారుతున్నాయి.
కు: "లేదురా...నువ్వు బాగుండాలి...నీకు మంచి జీవితం వుండాలి...ఇంట్లో ఒప్పుకోరు అని తెలిసి ప్రేమించటం నా తప్పు నా తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి.."
సరోజ ఇంక తను ఎంత చెప్పిన కుమార్ వినడని అర్ధం అయిపొయింది....
స: "సరేరా నువ్వు చచ్చిపో నీ తప్పు కాబట్టి...కాని నా సంగతేంటి నీ కోసం నేను రెండేళ్ళగా ఇంట్లో గొడవ పడుతున్న ఇప్పుడు వాళ్ళకి ఎలా మొహం చూపించాలి...పోనీ వాళ్ళని వదిలేయి మీ తల్లిదండ్రులని ఎలా ఎదుర్కోవాలి...ఎప్పుడు నాతో చెప్తుండేవాడివి కదా...నీకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవటానికి నీకు తోడుగా నేను వుంటాను అని...నాకు తోడుగా ఎప్పుడు వుంటాను అని...అవన్నీ అబద్దాలా??...ఒక్క సారి ఆలోచించు...నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను...నువ్వే నా ప్రాణం రా...నువ్వే లేక పోతే నేను ఇంక ఎలా బ్రతకాలి??"
కుమార్ కి ఆ మాటలు తూటాల్లా తన గుండెని తాకాయి...ఇంక సరోజ తో మాట్లాడలేక కట్ చేసేసాడు.వెంటనే ఫోన్ మోగింది నాన్న కాల్ చేస్తున్నారు.
కు: "హలో"
నా: "అరేయ్ నాకు చాలా కంగారుగా వుంది అసలు ఎక్కడున్నావ్ చెప్పు ... నేను వస్తాను మనం మాట్లాడదాం.."
కు: " ఇంక మాట్లాడేది ఏమి లేదు నాన్న నేను చచ్చిపోదాము అని నిర్ణయించుకున్నాను" ఎక్కడినించో ధైర్యం తెచ్చుకొని చెప్పేసాడు కుమార్.
అనుకున్నదంతా జరిగింది అని నాన్న బాదపడుతూ వీడిని ఎలాగన్నా ఆపాలి అన్న తాపత్రయం తో ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు...
నా: "అంత పని చేయమాకు రా...మా ఆశలన్నీ నీ మీదే వున్నాయి...నువ్వు లేకుండా మేము ఉండలేమురా...అరేయ్ ఆ ఒక్క అమ్మాయి దక్కక పోతే చనిపోవలా చెప్పు...చినప్పటినుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చాం కదరా... ఈ ఒక్క విషయం లో ఎందుకు కాదంటున్నారు అని ఆలోచించరా...నాన్నా నా మాట వినరా ఒక్క అవకాశం ఇవ్వరా నాకు నీతో మాట్లాడడానికి...నువ్వు లేకుండా మేము ఎలా వుండగలమురా...మీ అమ్మ అసలు తట్టుకోలేదు...ఒక్క అవకాశం ఇవ్వరా...నువ్వు ఎక్కడున్నావో చెప్పరా నేను వస్తాను కావాలి అంటే దూరం గా నుంచుని మాట్లాడతాను...ఇన్నేళ్ళు పెంచినందుకు ఒక్క అవకాశం ఇవ్వరా"
ఎప్పుడు ఎంతో గంబీరం గా మాట్లాడే నాన్న అంతలా బ్రతిమిలడుతుంటే సందిగ్దంలో పడ్డాడు కుమార్...తనని ఇంతలా ప్రేమించే అమ్మనాన్నలని, అమ్మాయిని వదిలేసి చనిపోవటం ఎంత వరకు భావ్యం అని ఆలోచనలు మొదలయ్యాయి... కాని తను ఇప్పుడు వెనక్కి తగ్గితే సమస్య మళ్ళి అలానే వుంటుంది అన్న ఆలోచన ఒక వైపు తొలచి వేస్తోంది...
నా: "అయినా నువ్వు చనిపోవాలి అనుకుంటే...నాకు చెప్పు నేను కూడా ఇక్కడ ఒక పురుగుల మందు డబ్బా తెచ్చుకొని అందరికి పోసి నేను తాగుతాను...నువ్వు చనిపోతే ఆ బాధ భరించే కంటే మేమి కూడా చనిపోవటం సులువు మాకు...అయినా చావు అనేది మార్గం కాదురా...నా మాట విను ఒక్క సారి కలువు నన్ను...దయ చేసి ఒక్క సారి కలువు " అని కంటతడి పెట్టుకున్నారు
ఒక్క సారి అందరి మాటలు విన్న కుమార్ కి తను చనిపోతే ఎంతమంది చనిపొతారో అని కళ్ళముందు కదిలింది...తన జీవితం లో ముఖ్యమైనవారందరూ చనిపోతారు అది కూడా తన వల్ల!!! అన్న ఆలోచన తన మెదడుని ఆక్రమించింది...చేతిలో వున్నా పురుగులమందు సీసా...కిందకి విసిరేసి తిరిగి రూముకి బయల్దేరాడు కుమార్...అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి ఎరుపు...కుమార్ కంటి ఎరుపు ముందు వెలవెల పోయింది...తను ఇంటికి, సరోజకి ఫోను చేసి తన నిర్ణయం చెప్పాడు..తరవాత ఇంకెప్పుడు కుమార్ ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు.
----------------*****కధ సమాప్తం*****------------------మీ నేస్తం
----------------*****కధ సమాప్తం*****------------------మీ నేస్తం
chivariki kumar saroja ni marriage chesukunnada leda????
ReplyDeleteకుమార్ పెళ్ళి సంగతి నాకు తెలియదు దిలీప్ కానీ మళ్ళి చనిపొయే ప్రయత్నం చేయకూడదు అనుకున్నాడు..నా కధ ఆ పూటకి మాత్రమే ఆలొచించాను...మొత్తం ఆలోచించి ఉంటే ఇద్దరికి పెళ్ళి చేసి ఉండేవాడినేమొ:)
ReplyDelete