ఉవ్వెత్తున ఎగసిపడే సంద్రం ఉనికి కోల్పోయిన క్షణం
రహదారి రణగొణ ధ్వనులు మరచి మూగబోయిన క్షణం
ఉదయభానుడు ప్రజ్వలజ్యోతి నశించి నల్లబోయిన క్షణం
నన్ను వీడి నా ఆత్మ అంతర్ధానమవుతున్న ఆ క్షణం
నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2011-01-03
2010-11-18
ఆచారాలు: మైలు
చిన్నప్పటి నించి మనకి మన పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు. ఉదాహరణకి పగిలిన అద్దంలో తల దువ్వకూడదు, రాత్రిళ్ళు గోళ్ళు తీయకూడదు ఇలాగ. కాని ఎందుకు అని అడిగితే మాత్రం చాలావరకు "అది మన ఆచారం" అనో "అది అంతే" అనో సమాధానం వస్తుంది. నాకు ఇది నచ్చక నేనే సమాధానం వెతకటం మొదలు పెట్టాను. ఇవి కేవలం నా ఊహాజనిత కారణాలే నిజమైన కారణాలు అవచ్చు కాకపోనువచ్చు.
ఈ మధ్య వరకు నేను మన పూర్వికులు ఈ కట్టుబాట్లు ఆచారాలు అసలు ఆలోచించకుండా అప్పటి వ్యవస్థ తగట్టు పెట్టారు అని అనుకున్నాను కాని ఈ మధ్యనే మా నాన్నగారు ఏదో ఒక సందేహం నివృత్తి చేసుకుందాము అని "పరాశర స్తుతి" అంతర్జాలం లో వెతికి పెట్టమన్నారు. ఎంత వెతికినా దాని ఆంగ్ల అనువాద ప్రచురణ మాత్రమే దొరికింది. నేను అందులో ఒకేఒక భాగము చదివాను ఆ భాగము ఒక మనిషి పోతే ఎన్ని రోజులు మైలు పట్టాలి అన్నదాని మీద అది చదివాక వాళ్ళ ఆలోచనలు నాకు చాలా బాగా అర్ధం అయ్యాయి.
ఆ గ్రంధం ప్రకారం ఎవరు ఎలా పోయిన ఇన్ని రోజులు అని లేదు. మనిషి జబ్బు వాళ్ళ పోతే ఇన్ని రోజులు, విషప్రభావం తో పోతే ఇన్ని రోజులు ఇలా రాసి ఉంది. దాని బట్టి నాకు ఏమి అర్ధం అయ్యింది అంటే మైలు అన్నది వాళ్ళు పెట్టింది ఆ చావు వల్ల వచ్చిన హానికరమైన పదార్దాలు/క్రిములు ఎక్కువమందికి పాక కుండ వుండాలి అని ఇలాంటి కట్టుబాటు పెట్టారు అని అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదని.
ఇంకా పరాశర మహాముని మైలు లో ఇచ్చిన సవరణలు చదివాక నాకు వాళ్ళ దూరాలోచన ఏంటో తెలిసింది. అందుకే ఏమో పెద్దలు అంటారు "పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట" అని. కాని ఒకింత బాధగా అనిపించింది ఇంత బాగా ఆలోచించి ఆయన రాస్తే దానిని తరతరాలుగా మార్చేస్తూ వచ్చి దానికి విలువలేకుండా చేస్తున్నందుకు :( . ఆ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీకు ఏముంది అన్నది వివరంగా మళ్లీ రాయాలి అనుకుంటున్నాను ఈ లోపు మీకు ఓపిక తీరిక ఉంటే మీరే చదువుకోండి మీకు అర్ధం అవుతుంది అయన ఎంత బాగా ఆలోచించారో!!!

2010-11-02
దీపావళి నిజంగా కాలుష్యం చేస్తుందా??
చాలా మంది మిత్రులు దీపావళికి మనం కాల్చే టపాసుల వలన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం జరుగుతాయి అని కాబట్టి దీపావళికి టపాసులు కాల్చొద్దు అని నాకు చెప్పారు. నేను చాలా ఆలోచించగా నాకు అనిపించినా కొన్ని విషయాలు చెప్దాము అని ఈ టపా రాస్తున్నాను. పాతకాలం లో దీపావళికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు టపాసులు చేసుకొనే వారని మా నాన్న చెప్తుంటారు. అప్పుడు ఇంటిలో చేసే టపాసులు అంత హానికరమైనవి చేయరు. మన ఇళ్ళలో పెద్దవాళ్ళకి తెలుసు ఏదైనా ఎక్కువ చేయకూడదు అని. అందుకే ఎక్కువ శబ్దం రాకుండా తయారు చేస్తారు.
అందుకే పూర్వం దీపావళి పండగ చాలా బాగా జరిగేవి వెన్నముద్దలతో, సిసింద్రిలతో, ఇంకా మా నాన్న చాలా చెప్తారు కాని నా బుర్రలో ఈ రెండే మిగిలాయి. ఏ టపాసులోనైనా మూడు రసాయనాలు వుంటాయి ఇంకా ఎక్కువ వుంటే అవి రంగులకోసమో, శబ్దం కోసమో, లేక రకరకాల ఆకారాలకోసమో కలుపుతారు. ఆ మూడు రసాయనాలు వల్ల వాతావరణానికి హాని కలిగించనివి అయితే చాలు మనం కాలుష్యం చేయనట్టే.
శబ్దకాలుష్యం కేవలం పెద్ద బాంబుల వల్లనే కలుగుతుంది చిన్నచిన్న బాంబులు నిర్దేశిత శబ్ద ప్రమాణాలలోనే పేలతాయి. ఇక వాయు కాలుష్యాన్ని ఆపటానికి రంగులు వచ్చే వాటి జోలికి పోకుండా వెళ్తే చాలు చాలా కాలుష్యం తగ్గించిన వారవుతారు.
దీపావళి నాడు టపాసులు కాల్చేది కేవలం పండుగకోసం మాత్రమే కాదు వానల వల్ల బాగా పెరిగిపోయిన దోమలని చంపటానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆఖరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, డాబుకి పోకుండా మతాబులు, కాకరపువత్తులు, చిచ్చుబుడ్డులు, భుచక్రాలు ఇంకా ఇలాంటి చిన్నచిన్న వాటితో దీపావళి జరుపుకోండి మీ జేబుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2010-10-26
కవిత: ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే
మొదటి సారి గగన ప్రయాణం చేస్తున్న ఒక వ్యోమగామి అంతరిక్షంలోనించి భూమిని చూస్తూ.....
కనుబొమ్మల ముందు కనపడు గోళమున
కనువిందు చేయు పచ్చిక కాన రాగ
కన్నులముందర గ్రహాలూ బంతులు కాగా
ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే!
కాంతులీను తారల నడుమ మనసు మోహనరాగమాలపించగా
కనురెప్పలు గ్రహగతులకు తాళము వేయగా
తేలియాడు శరీరము తాళమునకు నాట్యమాడగా
కనుమరుగవుతున్న ధరణి కాంతులాతని కన్నుల గాంచె!!
రెండవ కవితకి ఆలోచన మరియు సహకారం అందించిన శాంతి కి ధన్యవాదములు

2010-10-25
నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???
అది జనవరి మాసం...సంక్రాంతి సమయం... దూరం గా నక్కలు నిద్రపోతున్న సమయం...దగ్గరలో ఉన్న కోళ్ళు కూస్తున్న సమయం.నలుపంటే ఇష్టంలేని రామేశం రామేశ్వరం నించి తిరిగి వస్తున్న సమయం.....
రామేశం రామాలయం సందు తిరుగుతుండగా అడ్డం గా ఒక నల్ల కుక్క తన వీపు మీద నల్ల పిల్లిని ఎక్కించుకొని ఎదురుగా వచ్చింది. దానిని చూడగానే రామేశం రామనామం జపించటం మొదలెట్టాడు. అలాగే భయపడుతూ నల్ల పిల్లి కుక్కని చూసాను ఏమవుతుందో అని అడుగులోఅడుగు వేసుకుంటూ వెళ్తుండగా వయ్యారం గా వచ్చింది నల్ల చీరకట్టుకొని నీలాంబరి. రామేశాన్ని చూస్తూనే "ఏరా రాము ఎలాగున్నావ్!!! పొద్దెక్కింది ఇంకా నిద్రలేవలేదా" అని అన్నది.
"అదేంటి నేను నడుస్తుంటే నిద్రలేవలేదా అంటుంది నీలాంబరి ఆంటి" అని ఆలోచిస్తూ అలా నడక ముందుకి కొనసాగించాడు మన రామం. ఇంటిదేగ్గరకి వెళ్ళగానే నల్ల పిల్లి ప్రభావం వల్ల నాన్న ఏమన్నా వాకిట్లో ఉన్నాడేమో అని తోంగిచూసాడు. అమ్మ పేడనీళ్ళు కలుపుతోంది. నాన్న జాడ లేదు. హమయ్య నాన్న లేడు ఇంతకీ అమ్మ కలిపేది "నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???" అని ఇంట్లో అడుగుపెట్టాడో లేదో రామం ని చూడని వాళ్ళమ్మ పేడ నీళ్లు ఒక చెంబుతో తటాలన రామం మొహం మీద కొట్టింది.
వాసన చూస్తూ "హమయ్య తెల్లవుపేడే" అని కళ్ళు తుడుచుకుంటున్న రామం ఎదురుగా కనపడింది రాత్రి కప్పుకున్న బొమ్మల దుప్పటి నల్లని అంచు నీటిలో బాగా తడిచి బొటబొటా కారుతూ. దుప్పటి తీసి చూస్తే అదే నల్ల చీర కట్టుకొని నీలాంబరి ఆంటీ అమ్మ తో మాట్లాడుతూ..తిరిగి చూస్తే ఎర్రటి కళ్ళతో నిప్పులు చెరుగుతున్న నాన్న.....
ఇట్లు
మీ నేస్తం

2010-10-18
నా ఆలోచనలు -శీలం
నాకు ఈ రోజు చాలా చిరాగ్గా వుంది...ఏమి చేద్దాము అని ఆలోచిస్తుండగా నాకు ఒక టపా రాయాలి అనిపించింది. ఈ టపా మీకు అందరికి రుచించక పోవచ్చు. ఇవన్ని నా ఆలోచనలే కాని అన్ని ఒప్పులే అని నేను అనటం లేదు. నేను మాట్లాడబోయేది శీలం అనే దానిమీద.
దయ చేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు అని మనవి చేసుకుంటూ ఇక అసలు విషయానికి వస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ పదం గురించి చాలా సందేహాలు ఉండేవి. నేను చదివానో లేదో తెలియటానికి పరీక్షలు పెడతారు మరి ఒకడికి శీలం వున్నదా లేదా అని తెలుసు కోవటానికి ఏ పరీక్ష పెడతారు అన్నది నా చిన్ననాటి సందేహం. నేను పదవ తరగతి చదివేడప్పుడు వచ్చిన ఒక సినిమా వల్ల శీల పరీక్ష అని ఒకటి వుంది అని విన్నాను తర్వాత కొంచెం ఇంజనీరింగ్ వయసు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా ఒక పత్రిక లో "ఈ శీల పరీక్ష ఎంత వరకు నమ్మకమైనది?" అన్నదాని మీద వ్యాసం ప్రచురించారు. దాని ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే ఆ పరీక్ష ఫలితాలు నిజంగా శీలాన్ని కొలవలేవు అని. వివరాలలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్న.
తర్వాత ఉద్యోగం లోకి వచ్చి ప్రపంచం నా కంటితో నేను స్వయం గా చూడటం మొదలెట్టాక అర్ధం అయ్యింది శీలం అంటే ఏంటో. "శీలం అంటే నీ వ్యక్తిత్వాన్ని విడనాడకుండా జీవించటం" అని.
కాని సమాజం దృష్టిలో వాటికి ఒక నిర్వచనం వుంది దాని ప్రకారం కేవలం స్త్రీలకే పరిమితం చేసారు. ఇది ఎందుకు వాళ్ళకే పరిమితమో నాకు అర్ధం కాలేదు. ఒక స్త్రీ శారీరక సంబంధం కలిగి వుంటే తన శీలం పోయింది అని అంటుంటారు మరి అది చేసేది ఒక పురుషుడితో ఐనప్పుడు వాడి శీలం పోలేదా.శీలం ఏమన్నా కేవలం ఆడవారికే పరిమితమైన శరీరభాగామా నాకు తెలిసినంత వరకు కాదు. శీలం అన్నదానికి నైతిక కొలమానం తప్ప శాస్త్రీయ కొలమానం లేదు. ఒక స్త్రీకి శీలం పోయింది అని వివాహం ఆడటం మానేస్తే అలాగే ఒక పురుషుడి శీలం పోయిన కూడా వివాహం ఆడటం మానేయాలి. శీలం అన్నది ఆడవారికి మాత్రమే వుంటుంది అన్న అపోహ తొలగించుకోవాలి.
చివరాకరికి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే శీలం అన్నది అందరికి వుంటుంది. శారీరక సంబంధం వాళ్ళ అది పోదు అది మానసికమైన భావం. దానికి కొలమానం లేదు కేవలం తనకి తానూ గా మాత్రమే తెలుసుకోగలిగే భావం. మీ శీలం మీరు నిలబెట్టుకోవాలి అంటే మీ వ్యక్తిత్వాన్ని దేనికోసం వదులుకోవద్దు..
గమనిక: మీకు ఈ టపా నచ్చక పోతే దయ చేసి మన్నించగలరు

2010-10-15
దసరా/విజయదశమి శుభాకాంక్షలు
మషిషాసురుని ఒక సబల చంపినా
రావనాసురుని ఒక విల్లుకాడు చంపినా
చెప్పే సూక్తి నీలోని చెడుని చంపమనే
చెప్పే నీతి చెడుదోవ పట్టొద్దనే
రావనాసురుని ఒక విల్లుకాడు చంపినా
చెప్పే సూక్తి నీలోని చెడుని చంపమనే
చెప్పే నీతి చెడుదోవ పట్టొద్దనే
2010-09-23
కవిత: ఎందుకమ్మా కోపం???????????????
అలసిన వేళ పసిడి కాంతులతో సేద తీరుస్తావు
విరహపు వేళ చల్లని వెన్నెలతో తోడు అందిస్తావు
ప్రణయపు వేళ కొంటె చూపులతో సయ్యాటలు ఆడతావు
నిశిరాత్రి వేళ దరిచేరు జాబిలమ్మ ఈ నడిజామున నీకేల కోపమమ్మ!!!!

2010-06-23
బిచ్చగాళ్ళు vs ఫణి
నేను ఈ రోజు హైటెక్ సిటీ మీదుగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ చాలామంది చిన్నపిల్లల్ని అడుక్కోవటం చూసాను. వేసే వాళ్ళు వేస్తున్నారు లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా సిద్ధాంతాల ప్రకారం వాళ్ళకి దానం చేయకూడదు అనుకుని నేను వచ్చేసాను. కాని మనసులో ఏదో ఒక మూల అదే మెదులుతూ వుంది. దాదాపు ఒక కుటుంబం మొత్తం అక్కడే అడుక్కుంటూ బ్రతుకుతోంది. వాళ్ళందరిని కొందరు నీచం గా చూస్తారు కొందరు జాలితో చూస్తారు కొందరు విరక్తితో చూస్తారు. నిజానికి వాళ్ళకి నా లాంటి వాళ్ళకి తేడా ఏంటి అని అనిపించింది.
ఏంటి వీడికి మతి గాని పోయిందా? వాళ్లతో పోలికేంటి అని అనిపించచ్చు కాని ఏమో ఆలోచనలకి అంట తర్కం తెలియదు కద...
నేను అలా అనుకున్నాక వాళ్ళకి నాకు మధ్య ఉన్న సారుప్యాలు ఇంతా అని ఆలోచించాను. అవి ఈ విధం గా వున్నాయి
౧. వాళ్ళు పొద్దున్న నించి రాత్రిదాకా పని చేస్తారు నేను చేస్తాను
౨. వాళ్ళు డబ్బులు వేసిన వాడిని గొప్పవాడిగా చూస్తారు నేను నాకు ఉద్యోగం ఇచ్చిన వాడిని గోప్పవాడిలా చూస్తాను
౩. వాళ్ళు డబ్బులు వేయక పోతే తిట్టలేరు(అప్పుడప్పు తిడతారు కూడా!!!) నేను ఉద్యోగం ఇవ్వని వాడిని తిట్టలేను(నేను అప్పుడప్పుడు కూడా తిట్టలేని పరిస్దితి :()
౪. వాళ్ళకి రోజు ఇంత సంపాదించాలి అని టార్గెట్లు వుంటాయి నాకు రోజు ఇంత పని చేయాలి అని టార్గెట్ వుంటుంది
ఇంకా ఇప్పుడు బేదాలు చూద్దాము
౧. వాళ్ళు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సెలవ పెట్టొచ్చు నేను పెట్టలేను
౨. వాళ్ళు డ్యూటీ ఎప్పుడన్నా దిగాచ్చు నేను చచ్చినట్టు ౮ గంటలు పని చేయాలి
౩. వాళ్ళకి సెలవపెడితే ఆ రోజు తిండి ఉండకపోవచ్చు కాని నాకు సెలవ పెడితే జీతం ఇస్తారు
౪. వాళ్ళు ఎండలో పని చేయాలి నేను ఏ.సి. లో పని చేస్తాను
౫. వాళ్ళని సంఘం లో గుర్తింపు వుండదు కాని నాకు కొద్దో గొప్పో వుంటుంది
౬. వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది చేయచ్చు కాని నేను అలా చేయలేను మనసు చంపుకొని సంఘం చెప్పినట్టు చేయాలి
పైన పేర్కున్న అంశాలన్నీ చూసి నేను ఆలోచిస్తుండగా నా తలకాయ ఒక మొట్టికాయ వేసి వెధవ వాడి పని గురించి అలోచించి నీ పని ఎగొట్టక పని చేసుకో అని నాలుగు చివాట్లు పెట్టి ఆఖరికి నేను ఎందుకు పని చేయాలో హితబోధ చేసింది
"అందరు బిచ్చంఎత్తుకుంటే బిచ్చం వేసేవాడు వుండదు కద..నీ జాలి మీద వాడు బ్రతుకుతున్నాడు కాని నువ్వు నీ బుర్ర బుద్ధి ఉపయోగించి సంపాదించినా డిగ్రీ తెలివితేటలూ వాడి బ్రతుకుతున్నావ్ ఒకడు నీ మీద జాలి పడి ఉద్యోగం ఇవ్వడు నీ డిగ్రీ చూసి ఇస్తాడు" అని చెప్పి హాయిగా అది నిద్రలోకి జారుకుంది నేను మా క్లయింటు పెట్టిన బగ్గుల చిట్టా చూసుకుంటూ కూర్చున్న
నోట్: ఇది ఎందుకు రాసానో నాకు తెలియదు కాబట్టి నన్ను అడగద్దు

2010-06-07
వేదం-ఒక మంచి సినిమా
నేను ఎప్పటికీ సినిమా రివ్యూ రాయకోడదు అనుకున్నా కాని ఎందుకో వేదం గురించి రాయాలి అనిపించింది.
వేదం నాకు చాలా బాగా నచ్చింది. కధాపరంగా చాలా మంచి సినిమా. ఒక సినిమాలో ఆరుగురు విబిన్నమైన పాత్రలను చూపటం మరియు అన్ని పాత్రలకి సమప్రాధాన్యత ఇవ్వటం నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాకి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు నటులని దృష్టిలో పెట్టుకొని కాక మంచి కధ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే బాగుంటుంది.
సినిమా చాలా వరకు బాగుంటుంది అక్కడక్కడ కొంచెం వేగం తగ్గినా కొంచెం చిరకనిపించినా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం వేదం. చాలా వరకు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరలో వుంటాయి. ఒక్కడే 100 మందిని కొట్టటం నేను పులి అని నేను చిరుతని సోడాలు కొట్టటం లేకుండా కేవలం కధలో పాత్రలనే చూపించారు.
ఇంకా స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. నోటిలేక్కల్లో అయితే నాకు తెలిసి అన్ని పాత్రలకి సమానం గా సన్నివేశాలు వున్నాయి. ఎన్నో రోజులనించి ప్రేమకధలు,గొడవలు కొట్లాటలు, రాజకీయాలు చూసి విసిగిన నాలాంటి వాడికి ఈ సినిమా మంచి ఆటవిడుపు.
ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సినిమా కధ కోసం చూడండి అనుష్క కోసమో, మనోజ్ కోసమో, అర్జున్ కోసమో లేక క్రిష్ కోసమో కాకుండా కధ కోసం మాత్రమే వెళ్ళండి. మీకు తప్పక నచ్చుతుంది అని నా నమ్మకం.

Subscribe to:
Posts (Atom)