కౌసల్యా సుప్రజా! రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దులా! కర్తవ్యం దైవమాహ్నికం...
తెలతెల్లవారుతోంది రాత్రి చూసిన సినిమా ఇంకా గుర్తు వస్తూ ఉంది మన హీరో సుబ్బారావుకి. సుబ్బారావు ముద్దుగా సుబ్బిగాడు ఒక పెద్ద సాఫ్టువేరు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. నెలతిరిగే సరికి అర లక్షజీతం దానితో పాటు అరకిలో బరువు బిల్లులు వస్తాయి. అవి కట్టుకునే సరికి సుబ్బిగాడి ఖాతాలో అణా కూడా మిగలదు. అందుకే సుబ్బిగాడు వయస్సు మూడుపదులు దాటుతున్నా పెళ్ళి మాట ఎత్తలేదు ఇంట్లో. కానీ సుబ్బిగాడి అమ్మ నాన్న మాత్రం గత 3 ఏళ్ళుగా వాడికి పెళ్ళికూతురుని వెతికేపనిలొనే ఉన్నారు.
సుబ్బిగాడు ఏజి 30+ అయినా కనిపించటానికి 25 లాగనే వుంటాడు. ఈ రోజు వాదికి 100వ పెళ్ళిచూపులు ఈ సారన్నా సుబ్బిగాడు ఓకే అనాలి అని వాడి అమ్మనాన్న మొక్కని దేవుడు లేడు ఎక్కని గుడిమెట్లు లేవు. ఈ పెళ్ళిచూపులు ఎలగన్నా తప్పించుకోవాలి అని మన సుబ్బిగాడు చాలా ప్రయత్నాలు చేసాడు కానీ ఏది పనికి రాలేదు పైగా అందులో ఒకటి బెడిసికొట్టి సాయంత్రం ఆరింటికి జరగాల్సిన పెళ్ళిచూపులని పొద్దున ఆరింటికి మారేటట్టు చేసింది. ఇందాక మీరు చదివిన ఆ సుప్రభాతం మన సుబ్బిగాడి అలారం సౌండే..
పొద్దుపొద్దునే ఈ పాడు పెళ్ళిచూపులు ఏంటిరా దేవుడా అంటూ బద్ధకంగా లేచాడు మనసుబ్బిగాడు. లేచి సెల్లులో టైము చూస్తున్నాడు వెంటనే వచ్చింది పల్లెటురులో ఉన్న అమ్మనాన్నలనించి ఫోను
"అరేయ్ బడుద్దాయ్! లేచావా లేదా నిన్న చెప్పింది అంతా గుర్తున్నది కదా మంచిగా గెడ్డం చేసుకో.. పొయిన సారి పెళ్ళి చూపులకి వేసుకున్నావే అలాంటి నవ్వారు గుడ్డలు వేసుకోకుండా" అని ఎదో చెప్పబోయాడు సుబ్బరావు తండ్రి అప్పారావు. కాని దానిని మధ్యలోనే ఆపేస్తూ
"వాటిని జీన్స్ అంటారు మీరు చెప్పే నవ్వారుకి దీనికి చాలా తేడా వుంది అయినా పోయిన సారి నేను వేసుకు వచ్చింది బ్రాండెడ్ జీన్స్ తెలుసా మీకు" అని గట్టిగా అరిచాడు మన సుబ్బిగాడు.
మీకు చెప్పటం మర్చిపొయాను మన సుబ్బిగాడికి వచ్చిన ఆ అరకిలో బిల్లులు ఏవో లోనువి అని పొరబడేరు అవన్ని మన సుబ్బిగాడి బట్టలకీ ఇంకా మిగితా సరంజామా కొనటానికి గీకిన క్రెడిట్ కార్డుల తాలూకా బిల్లులు. అలాగని సుబ్బిగాడు మరీ దుబారా అనుకోకండి ప్రతీ నెలా తన దగ్గర వున్న డజను కార్దులలో ఒక దానిని ఎంచుకొని దాని లిమిట్ వచ్చేదాకానే షాపింగ్ చేస్తాడు.
"ఏదో ఒక దరిద్రంలే ఈ సారన్నా ఆ పిల్ల నచ్చింది అని చెప్పరా నీచేత ఆ మూడు ముళ్ళు వేయించేసి ఇంక మేము ధైర్యంగా వరల్ద్ టూరు కి వెళ్ళచ్చు" అన్నదు అప్పరావు.
తండ్రి కంగారు తన పెళ్ళి మీదా లేదా టూరు మీదా అన్న మీమంసలోనే "సరే" అని చెప్పి ఫోను పెట్టేశాడు.
ఈ సారి ఎలా పెళ్ళిచూపులు చెడగొట్టాలా? అని అలోచిస్తుండగా కాలింగ్ బెల్లు మొగింది. ఈ టైములో ఎవరా? అని చిరాకుగా తలుపు తలుపు తీసాడు. ఎదురుగా నుంచున్న వ్యక్తి తలుపు తేరవగానే "సాబ్ చెత్త డబ్బుల్" అన్నాడు.
పొద్దుపొద్దునే ఈ చెత్త గోల ఏంటి అని గొణుకుంటూ జేబులోంచి ఒక 20 నోటు తీసి అతనికి ఇచ్చి తలుపు వేసేసాడు. ఎంత ఇష్టంలేకున్నా వెళ్ళేది పెళ్ళిచూపులకి కదా. అసలే అలిండియా సోలో అందగాడిని అనుకుంటూ ఒకసారి కొత్తగా ఈమధ్యనే కొన్న నిలువుటద్దం ముందు నిల్చున్నాడు. ఒక సెకను చూసుకున్నడో లేడో మళ్ళీ కాలింగు బెల్లు మోగింది. ఈసారి ఎవడురా? అని చిరాగ్గా తలుపు తెరిచాడు ఎదురుగా మన సుబ్బిగాడి రూముమేట్ బాబిగాడు కనిపించాడు.
బాబి ఒక కాల్ సెంటర్లో పని చేస్తాడు. వాడు రోజూ సురీడు నిద్రపోగానే వెళ్ళి నిద్రలేచే లోపు తిరిగొస్తుంటాడు. పేరుకి ఇద్దరూ ఒకే రూము కానీ ఇద్దరూ కలిసి ఒక 10 నిముషాలు మాట్లాడేది నెలకి ఒకట్రెండు సార్లు మించదు.
ఈ రోజుకి నేను కేవలం మన హీరో సుబ్బిగాడి పరిచయం చేయగలిగాను త్వరలో మీకు సుబ్బలక్ష్మిని పరిచయం చేస్తాను. సమయాభావం వల్ల ఇలాగా కధని ముక్కలు చేసి రాస్తున్నాను
సమయాభావం వల్ల, నేనూ పూర్తిగా చదవలేదు. ఈలోగా చిన్న విషయం.
ReplyDeleteఇది ఇలా ఉండాలి అనుకుంటా :
కౌసల్యాసు ప్రజ రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే!
ఉత్తిష్ఠ! నరశార్దులా! కర్తవ్యం దైవమాహ్నికం.
పాడేటప్పుడు మాత్రం సుబ్బలక్ష్మిగారిలా పాడితానే, దేవుడ్ని నిద్రలేపినట్టు ఉంటుంది. అది వేరే విషయం :)
i am waiting for 2nd part :-)
ReplyDeleteమీ రచన చాలా బాగుంది.. అయితే పంటి కింద రాయిలా భాషా దోషాలు ఉన్నాయి. సవరించండి.
ReplyDeleteఉదాహరణకు కొన్ని
1. ....ఐనా కనిపించతనికి
2. ....యెది
3. ...సయంత్రం
4.....అలరం సౌండే
5......దెవుడా
6.......ఫొను
7......అలంతి నవ్వరు
8. ....వెసుకొచ్చింది
9. .......అలగని
10. ......వెయించేస్తే
మీ బ్లాగ్ చాలా బావుంది.
ReplyDelete:)..ఈ పాటికే రెండోది పడిపోతుందేమో అనుకున్నానే!
ReplyDeleteటైపులో చాలా ఉన్నాయి.ఆల్రెడీ చెప్పారు కూడా కదా!
ముందుగా నా బ్లాగు చదివిన మీ అందరికీ ధన్యవాదములు.
ReplyDelete@రేరాజ్,నాలోనేను-- మీరు చెప్పినట్టు తప్పులు సవరించాను