2011-05-30

యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు :(

యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...
పండగ లేదు పబ్బం లేదు రాతిరిలేదు పగలు లేదు...
పెళ్ళాం లేదు పిల్లలు లేరు పని మాత్రం గంపెడుంటది...
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి బ్రతుకులు...

సెనివారమెల చేలినేంట పెట్టుకొని సినిమాకి పోతే...
సెల్లుమోగే గుండె పగిలే..ఆఫీసుకి రమ్మని ఫత్వాలు వచ్చే...
మెల్లంగ చూసి చెలి చెవిన వేస్తే చీ..పో అంటే చీదరించి పంపే...
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...

అర్దరాతిరేల క్లయింటు లయిన్లకోచ్చే... అర్ధం కాని బాషలో లెఫ్టు రైటు ఇచ్చే
పోద్దుగాలికల్ల నాగిట్ల కావలనడిగే...కళ్ళు మంటలోచ్చే కీళ్ళ నేప్పులోచ్చే...
తెల్లారే సరికల్లా నాకు నూట నాలోగోచ్చే...క్లయింటు గాడికేమో నా మీద కోపం వచ్చే..
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...




2 comments:

  1. వేలకు ..వేలు..జీతాలు ..వళ్ళోకొచ్చి ..పడ్తలేవా..అన్న..మల్ల..కల్లు నొప్పులూ..కాల్ల నొప్పులూ..వస్తే ఊకోవాలె..

    ReplyDelete
  2. అనురాధ గారు..కామెంటినందుకు ధన్యవాదములు.. మీకు జీతాలు మాత్రమె కనిపిస్తున్నాయి..కాని ఆ జీతం తీసుకోనికి ఐ.టి కి తాకట్టు పెట్టిన మా జీవితాలు కనిపించట్లెదు..మిగితా రంగాల్లొ కూడా మా అంత జీతాలు వస్తాయి కాని కొంచెం ఆలస్యంగా...ఏ రంగంలొనైనా సుఖలెన్నొ కష్టాలు అన్నే వుంటాయి. జనాలు ఐ.టి వాళ్ళు సుఖపడతారు అన్న భ్రమ పడుతున్నారు అని పైన టపా రాసాను అంతే.

    ReplyDelete