సినిమా తారలు ఐ. టి లో పని చేస్తుంటే వాళ్ళ పంచ్ డైలాగులు ఇలాగ ఉండేవేమో:
చిరంజీవి:
1. వీర బగ్గర్ రెడ్డి...! బాగ్గే కదా అని లైట్ తీసుకుంటే హైకు కట్ చేస్తా!!!
2.తన బగ్గులని వెతకటానికని ఒక కొత్త టెస్టర్ ని తీసుకుంటే ఆ టెస్టర్ తో డైలాగు...
"థాంక్స్ చెప్పకు..నువ్వు కూడా నాలుగు బగ్గులు వదిలేసి ఇంకో ముగ్గురికి ఉద్యోగం ఇప్పించు...వాళ్ళని థాంక్స్ కి బదులుగా ఇంకో ముగ్గురికి ఇప్పించమని చెప్పు"
౩. గాంధీగిరి చేస్తున్న చిరంజీవి కి ఒక టెస్టర్ వచ్చి ఇలాగ చెప్పాడు
" అన్న ఒక డెవలపర్ వున్నాడు అన్న రోజు అదే బగ్గు పెట్టి కోడ్ కమిట్ చేస్తున్నాడు..నేను టెస్ట్ చేయలేక పోతున్న అన్న"
"కంగారు పడకు తమ్ముడు...ఇక నించి వాడు ఆ బగ్గు పెట్టినప్పుడల్లా నవ్వుతు ఆ బగ్గు రిపోర్ట్ డిలీట్ చేసేయి వాడి ముందే వాడే మారతాడు"
రెండు రోజులు పోయాక
"ఏంటి తమ్ముడు వాడు ఆ బగ్గు పెట్టటం మానేసాడా?"
"లేదన్నయ్య నన్ను మా మేనేజర్ కంపని నించి తరిమేసాడు"
బాలయ్య:
1. చూడు పాజిటివ్ టెస్టింగ్ ఏ చూడు! నెగెటివ్ చూడకు! మాడిపోతావ్!! పిచ్చోదివైపోతావ్!!!
2. నీ కంపనీ కి వచ్చా!! నీ టీము లోకి వచ్చా!! నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నది సి# కోడె అయితే !! నువ్వు నిజంగానే ఈ మోడ్యులు చేసుంటే!! చెకిన్ చేయరా చూసుకుందాం!!
౩. క్లయింటు పోసిషన్ లో వున్నా బాలయ్య "ఇష్యులతో కాదురా చేయింజు రెక్వేస్టులతో చంపేస్తా"
మహేష్ బాబు:
1 . ఎప్పుడోచ్చాం అని కాదన్నయ్య బగ్గు పెట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్
2 . ఒక్క సారి కోడ్ చేస్తే నా లాజిక్ నాకే అర్ధం కాదు
౩. ఎవడు కోడ్ చేస్తే బ్రౌజరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు
4. బగ్గులు చూడాలి అనుకో పర్లేదు..కోడు చూడలనుకోకు పిచ్చేక్కిపోతావ్
జూ. ఏన్.టి. ఆర్
1 . గూగుల్ తోడూ ఇష్యూ దొరక్కుండా కోడ్ చేస్తా
2 . ఈ సీమలో మొదట బగ్గు చేసింది మాతాత మొదట క్రాష్ చేసింది మా బాబాయి...వాటితో నన్ను బయపెట్టలేరు..(క్యు.ఏ కి వార్నింగ్ ఇస్తూ)
౩. ఆన్ సైటు నించి వచ్చాడు సాఫ్టుగా లవర్ బాయ్ లాగున్నాడు అనుకోవద్దు క్యారెక్టర్ కొట్టగా వుందని ట్రై చేశాను లోపల ఆఫ్ షోరూ డెవలపర్ అలానే ఉన్నాడు...బయటకి వస్తే రచ్చ రచ్చె...
నోట్: పైన రాసిన డయిలాగులు ఎవరిని కించపరచటానికి కాదు గమనించగలరు
ఈ ఆలోచన ఇచ్చిన సూర్యపవన్ కి నా కృతఙ్ఞతలు.
ఇట్లు
మీ నేస్తం
Thank you for a good laugh in the morning
ReplyDeleteకామెంటినందుకు ధన్యవాదములు కొత్తపాళిగారు
ReplyDeletekatti phani...
ReplyDeleteకామెంటినందుకు ధన్యవాదములు విజ్జు గారు
ReplyDeletesuper creativity..ha..ha..bedirindi.
ReplyDeleteధన్యవాదములు శరత్ గారు మరియు శశి గారి
ReplyDeletebagu bagu ...:)
ReplyDeleteకమెంటినందుకు ధన్యవాదములు సాయిగారు
ReplyDeleteSuper, I especially like Mahesh and NTR Jr. dialogs
ReplyDeleteధన్యవాదములు అనొనిమస్ గారు
ReplyDeleteఫంచ్ డైలాగులు చాలా బాగున్నాయ్ ఫణి గారు ...
ReplyDeleteఇట్లు,
మీకు కాబోయే మీ నేస్తం
Excellent dialogues. I like ఈ సీమలో మొదట బగ్గు చేసింది మాతాత మొదట క్రాష్ చేసింది మా బాబాయి...వాటితో నన్ను బయపెట్టలేరు..(క్యు.ఏ కి వార్నింగ్ ఇస్తూ)
ReplyDelete