మషిషాసురుని ఒక సబల చంపినా
రావనాసురుని ఒక విల్లుకాడు చంపినా
చెప్పే సూక్తి నీలోని చెడుని చంపమనే
చెప్పే నీతి చెడుదోవ పట్టొద్దనే
నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.
2010-10-15
2010-09-23
కవిత: ఎందుకమ్మా కోపం???????????????
అలసిన వేళ పసిడి కాంతులతో సేద తీరుస్తావు
విరహపు వేళ చల్లని వెన్నెలతో తోడు అందిస్తావు
ప్రణయపు వేళ కొంటె చూపులతో సయ్యాటలు ఆడతావు
నిశిరాత్రి వేళ దరిచేరు జాబిలమ్మ ఈ నడిజామున నీకేల కోపమమ్మ!!!!

2010-06-23
బిచ్చగాళ్ళు vs ఫణి
నేను ఈ రోజు హైటెక్ సిటీ మీదుగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ చాలామంది చిన్నపిల్లల్ని అడుక్కోవటం చూసాను. వేసే వాళ్ళు వేస్తున్నారు లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా సిద్ధాంతాల ప్రకారం వాళ్ళకి దానం చేయకూడదు అనుకుని నేను వచ్చేసాను. కాని మనసులో ఏదో ఒక మూల అదే మెదులుతూ వుంది. దాదాపు ఒక కుటుంబం మొత్తం అక్కడే అడుక్కుంటూ బ్రతుకుతోంది. వాళ్ళందరిని కొందరు నీచం గా చూస్తారు కొందరు జాలితో చూస్తారు కొందరు విరక్తితో చూస్తారు. నిజానికి వాళ్ళకి నా లాంటి వాళ్ళకి తేడా ఏంటి అని అనిపించింది.
ఏంటి వీడికి మతి గాని పోయిందా? వాళ్లతో పోలికేంటి అని అనిపించచ్చు కాని ఏమో ఆలోచనలకి అంట తర్కం తెలియదు కద...
నేను అలా అనుకున్నాక వాళ్ళకి నాకు మధ్య ఉన్న సారుప్యాలు ఇంతా అని ఆలోచించాను. అవి ఈ విధం గా వున్నాయి
౧. వాళ్ళు పొద్దున్న నించి రాత్రిదాకా పని చేస్తారు నేను చేస్తాను
౨. వాళ్ళు డబ్బులు వేసిన వాడిని గొప్పవాడిగా చూస్తారు నేను నాకు ఉద్యోగం ఇచ్చిన వాడిని గోప్పవాడిలా చూస్తాను
౩. వాళ్ళు డబ్బులు వేయక పోతే తిట్టలేరు(అప్పుడప్పు తిడతారు కూడా!!!) నేను ఉద్యోగం ఇవ్వని వాడిని తిట్టలేను(నేను అప్పుడప్పుడు కూడా తిట్టలేని పరిస్దితి :()
౪. వాళ్ళకి రోజు ఇంత సంపాదించాలి అని టార్గెట్లు వుంటాయి నాకు రోజు ఇంత పని చేయాలి అని టార్గెట్ వుంటుంది
ఇంకా ఇప్పుడు బేదాలు చూద్దాము
౧. వాళ్ళు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సెలవ పెట్టొచ్చు నేను పెట్టలేను
౨. వాళ్ళు డ్యూటీ ఎప్పుడన్నా దిగాచ్చు నేను చచ్చినట్టు ౮ గంటలు పని చేయాలి
౩. వాళ్ళకి సెలవపెడితే ఆ రోజు తిండి ఉండకపోవచ్చు కాని నాకు సెలవ పెడితే జీతం ఇస్తారు
౪. వాళ్ళు ఎండలో పని చేయాలి నేను ఏ.సి. లో పని చేస్తాను
౫. వాళ్ళని సంఘం లో గుర్తింపు వుండదు కాని నాకు కొద్దో గొప్పో వుంటుంది
౬. వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది చేయచ్చు కాని నేను అలా చేయలేను మనసు చంపుకొని సంఘం చెప్పినట్టు చేయాలి
పైన పేర్కున్న అంశాలన్నీ చూసి నేను ఆలోచిస్తుండగా నా తలకాయ ఒక మొట్టికాయ వేసి వెధవ వాడి పని గురించి అలోచించి నీ పని ఎగొట్టక పని చేసుకో అని నాలుగు చివాట్లు పెట్టి ఆఖరికి నేను ఎందుకు పని చేయాలో హితబోధ చేసింది
"అందరు బిచ్చంఎత్తుకుంటే బిచ్చం వేసేవాడు వుండదు కద..నీ జాలి మీద వాడు బ్రతుకుతున్నాడు కాని నువ్వు నీ బుర్ర బుద్ధి ఉపయోగించి సంపాదించినా డిగ్రీ తెలివితేటలూ వాడి బ్రతుకుతున్నావ్ ఒకడు నీ మీద జాలి పడి ఉద్యోగం ఇవ్వడు నీ డిగ్రీ చూసి ఇస్తాడు" అని చెప్పి హాయిగా అది నిద్రలోకి జారుకుంది నేను మా క్లయింటు పెట్టిన బగ్గుల చిట్టా చూసుకుంటూ కూర్చున్న
నోట్: ఇది ఎందుకు రాసానో నాకు తెలియదు కాబట్టి నన్ను అడగద్దు

2010-06-07
వేదం-ఒక మంచి సినిమా
నేను ఎప్పటికీ సినిమా రివ్యూ రాయకోడదు అనుకున్నా కాని ఎందుకో వేదం గురించి రాయాలి అనిపించింది.
వేదం నాకు చాలా బాగా నచ్చింది. కధాపరంగా చాలా మంచి సినిమా. ఒక సినిమాలో ఆరుగురు విబిన్నమైన పాత్రలను చూపటం మరియు అన్ని పాత్రలకి సమప్రాధాన్యత ఇవ్వటం నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాకి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు నటులని దృష్టిలో పెట్టుకొని కాక మంచి కధ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే బాగుంటుంది.
సినిమా చాలా వరకు బాగుంటుంది అక్కడక్కడ కొంచెం వేగం తగ్గినా కొంచెం చిరకనిపించినా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం వేదం. చాలా వరకు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరలో వుంటాయి. ఒక్కడే 100 మందిని కొట్టటం నేను పులి అని నేను చిరుతని సోడాలు కొట్టటం లేకుండా కేవలం కధలో పాత్రలనే చూపించారు.
ఇంకా స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. నోటిలేక్కల్లో అయితే నాకు తెలిసి అన్ని పాత్రలకి సమానం గా సన్నివేశాలు వున్నాయి. ఎన్నో రోజులనించి ప్రేమకధలు,గొడవలు కొట్లాటలు, రాజకీయాలు చూసి విసిగిన నాలాంటి వాడికి ఈ సినిమా మంచి ఆటవిడుపు.
ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సినిమా కధ కోసం చూడండి అనుష్క కోసమో, మనోజ్ కోసమో, అర్జున్ కోసమో లేక క్రిష్ కోసమో కాకుండా కధ కోసం మాత్రమే వెళ్ళండి. మీకు తప్పక నచ్చుతుంది అని నా నమ్మకం.

2010-05-31
నన్ను చేరగా రావా చెలి................
చిరుగాలుల అలజడిలో నిలిచిన ఈ చిరుదీపాన్ని కాపాడగ రావా చెలి ఈ వెన్నలరాతిరిలో
కాలిఅందియల సవ్వడికోసం విలపించే నా హృదయాన్ని ఓదార్చగ రావా చెలి ఈ వేకువజాములో
కంటిపాపల కవ్వింతలులేక కన్నీరైన నా జీవితాన్ని వెలిగించగా రావా సఖి ఈ నడిజాములో
మెరుపులా మెరిసిన నీ జాడలేక తపిస్తున్న నా ఎదని ఆక్రమించగా రావా సఖి ఈ సాయంసంధ్యలో

2010-05-07
ఎండాకాలపు వాన చిత్రాలు
చినుకుల సవ్వడిలో చిన్నారుల పడవల ఆటలు
పగిలిన గుండెలతో రైతుల మూగ మాటలు
నిలిచిన నీటితో ఉద్యోగుల బాధలు
ఇవ్వేలే ఎండాకాలపు వాన చిత్రాలు
పగిలిన గుండెలతో రైతుల మూగ మాటలు
నిలిచిన నీటితో ఉద్యోగుల బాధలు
ఇవ్వేలే ఎండాకాలపు వాన చిత్రాలు
2010-05-06
ఎందుకింత నిర్లక్ష్యం???
నిన్న నేను హైదరాబాదు పోలీసుల సోదాల గురించి వారి కష్టాల గురించి టపా రాసి ఇంటికి బయల్దేరాను. ఈ లోపు మా రూమ్మేట్ ఫోను చేసి బి+ రక్తం కావాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు వుంటే కేర్ ఆసుపత్రికి పంపమన్నాడు. నాలుగు నెలల పాప కి ఓపెన్ హార్ట్ సర్జరీ అంట ఆపరేషను అయ్యిపోయింది కాని పాప కి ప్లాటిలెట్స్ కావాలి అంట. అందరం ఆసుపత్రికి వెళ్ళాము టపా రాసిన ప్రభావమో లేక పోతే మనసులో బలంగా నటుకుపోయిందో తెలియలేదు కాని అక్కడ నేను మొదట గమనించింది మాత్రం భద్రత ఏమాత్రం వుంది ఇంత పెద్ద ఆసుపత్రికి అని. నేను నా బ్యాగ్గు వేసుకొని లోపాలకి వెళ్తుంటే దానిని తెరిచి చూసిన పాపానికి ఎవడు పోలేదు.
లోపలి వెళ్ళేటప్పుడు ద్వారం వద్ద మాత్రం ఒక మెటల్ గుర్తించే ద్వారం వుంది (దానిని ఏమి అంటారో నాకు తెలియదు ) అందులోనించి అందరు వెళ్ళాలి. పోనిలే కనీసం ఇదన్నా వుంది అనుకొని లోపలి వెళ్ళాను. కాని లోపలి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే లోపలి రావటానికి ఇది ఒకటే కాదు చాలా మార్గాలు వున్నాయి అక్కడ కనీసం ఒక గార్డు కూడా లేడు అని. బంజారా హిల్స్ సెంటరులో ఉన్న ఆసుపత్రి అది.. దానికి చాలా పెద్ద పెద్ద హొదాలో వున్నవారు చికిత్సకి వస్తారు . అప్పట్లో బాలకృష్ణ,రామలింగరాజు, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడే వైద్యం చేయించుకున్నారు అని చదివాను.
ఇంకా సామాన్యులు చాలామందే అక్కడికి వైద్యం కి వెళ్తారు. మరి ఇంత మంది అక్కడ వుంటారు కదా వాళ్ళకి ఆసుపత్రి కల్పించే భద్రత ఎంత అంటే గుండు సున్నా... ఒకవ్యక్తి బ్యాగ్గు లో ఏదైనా పెట్టి అక్కడ వదిలేసి వెళ్ళినా పట్టించుకొనే దిక్కు లేదు. నగరంలో తీవ్రవాదుల ముప్పు వుంది అని వార్తలు వచ్చినా ఇంకా ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంట ఫీజులు తీసుకొనే ఆసుపత్రి కనీస బాధ్యతల్లో ఇది ఒకటి కాదా? సినిమా హాలు లో సరైన భద్రత లేకపోతే అప్పట్లో పోలీసు వారు హాలు మూసేసే వారు అలాగే ఆసుపత్రులు కూడా సోదా చేసి సరైన భద్రత లేని ఆసుపత్రుల చిట్టా ఒకటి పత్రికల్లో ప్రచురించాలి ప్రజలని ఆ ఆసుపత్రులతో జాగ్రత్త అని అప్రమత్తం చేయాలి.. నలుగురు సరైన భద్రత సిబ్బందిని పెట్టలేను ఆసుపత్రి యాజమాన్యానికి లక్షలు కుమ్మరిస్తున్న రోగులు కూడా ఒక్కసారి అడగాలి ఎందుకు నీకు ఇంత ఇవ్వాలి కనీస భద్రత లేనప్పుడు అని ? ఈ ఆసుపత్రి కాక పోతే ఇంకో ఆసుపత్రి నాకు తెలిసి హైదరాబాదులో డాక్టర్లకి కొరత లేదు..
రోగుల భద్రత మీద ఇంత నిర్లక్ష్యం ఉన్న ఆసుపత్రి యాజమాన్యం రోగుల కష్టాలని పట్టించుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు. నా ఉద్దేశంలో మానవత్వం మరియు బాధ్యత లేని వైద్యం వైద్యమే కాదు.

2010-05-05
పాపం హైదరాబాదు పొలీసులు....:(
మొన్న నేను ఆఫీసునించి రూముకి బస్సులో వెళ్తున్నా. మాధాపూర్ నించి మా రూము 14 కిలోమీటర్లు. అందుకే రోజు బస్సు ఎక్కి నిద్రపొవటం నా అలవాటు. అలాగే మొన్న కూడా నిద్రపొతుంటే మసబ్ టాంక్ దగ్గర బస్సు ఆపేసారు. నేను నిద్రలేచి ఎందుకు అని అలొచించేలొపే ఒక కానిస్టేబుల్ వచ్చి "బ్యాగ్గు తెరిచి చూపించండి" అని అడిగాడు. నేను అలానే చేసాను. బస్సులో అందరివి చూసి వాళ్ళు వెళ్ళిపొయారు. కాని వాళ్ళ ఆలొచన నా మనసు నించి వెళ్ళలేదు.
ఇప్పట్లో టిఫిన్ బాక్స్ బాంబులని, మానవ బాంబులని ఉగ్రవాదులు ఏన్నొ కొత్త విధాలలో దాడి చేస్తుంటే వాటిని ఎదుర్కొటానికి పొలీసులకి వున్నవి అరకొర మెటలు డిటెక్టర్లు, పొలీసు కుక్కలు. మా బస్సు లో ఎక్కిన వాళ్ళకి ఐతే ఆ సదుపాయాలు కూడా లేవు. మా బస్సులో కనుక ఇలాంటి బాంబు ఏదైనా ఉండి ఉంటే అందరము ఈ పాటికి పొయుండెవాళ్ళం. మా సంగతి ఇప్పటికి పక్కన పెడితే ఆ చెకింగ్ కి వచ్చిన పొలీసులకి తెలుసు వాళ్ళ దగ్గర వున్న ఆయుధాలు ఎందుకు పనికి రావు అని.. ఒక వేళ నిజంగా అక్కడ తీవ్రవాది ఉండి ఉంటే వాడి దగ్గర తుపాకి అన్నా ఉండి ఉంటుంది దానిని ఆ కానిస్టబుల్ లాఠితో ఎలా ఎదుర్కొగలడు??
ఒకవేళ ఎక్కడన్నా ఒక బాంబు పేలితే వచ్చే మొదటి విమర్శ "ఇది కేవలం నిఘా వర్గాల వైఫల్యం" లేక పొతే "ఇది మన పోలీసు వారి వైఫల్యం". ఈ విమర్శలు చేసేది మంత్రులు ఇంకా మీడియా వాళ్ళు. ఏ బాంబు పెలేదాక వాళ్ళ వైఫల్యాలు ఎందుకు గుర్తించలేక పోతోంది ప్రభుత్వం ఇంకా మీడియా.. ఎన్ని స్కాములని రహస్య కెమెరాలతో చిత్రించి చూపించే మీడియా తీవ్రవాదులని ఎందుకు బందించలేక పోతోంది తమ రహస్య కెమెరాలలో?
ప్రాణాలకి తెగించి చెకింగ్ చేస్తున్న ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు అత్యాదునిక పరికరాలు లేవు దీని మీద ఎందుకు అసెంబ్లీ ఆపారు. ప్రాణం కన్నా ప్రాంతమో డాములో పెద్దవా? పోలీసు బాగోగులు గురించి గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? వారికి పెద్ద జీతాలు ఎలాగో ఇవ్వరు కనీసం వారికి ఆధునిక పరికరలిచ్చి అయినా సహకరించారా? అందుకే నాకు అనిపించింది "పాపం హైదరాబాదు పోలీసులు :( "

2010-05-04
వేచి ఉంటానే చెలి నీ కొరకు
నీ కోసం వేచిన నా కళ్ళు అలసినా
నీ ధ్యానంలో మరచిన నా జీవితం పిలిచినా
వేచి ఉంటానే చెలి నా తుదిస్వాస వరకు
వేచి ఉంటానే సఖి నా గొంతు మూగబోయే వరకు..
నీ ధ్యానంలో మరచిన నా జీవితం పిలిచినా
వేచి ఉంటానే చెలి నా తుదిస్వాస వరకు
వేచి ఉంటానే సఖి నా గొంతు మూగబోయే వరకు..
2010-04-28
ఈ వేసవి వేడి తట్టుకోలేకపోతున్నాం
నిన్న నేను కొంచెం ఆలస్యంగా నిద్రలేవటం వాళ్ళ ఆఫీస్ కి వచ్చేసరికి 11 అయ్యింది. వచ్చేసరికి చొక్కా తడవటం ఎండటం కూడా అయ్యిపోయింది. నా చిన్నతనం అంతా దాదాపుగా విజయవాడ దగ్గరలో అవ్వటం వల్లనేమో వడదెబ్బ కొట్టకుండా తట్టుకున్నాను లేక పోతే ఈ ఎండకి నేను నిమ్స్ లో భర్తీ అవ్వాల్సి వచ్చేది.
నాలుగు సంవత్సరాలు క్రితం నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఇలా వుండేది కాదు ఎంత ఎండ వున్నా చెమట వచ్చేది కాదు. కాని ఈ మద్యన బాగా చెమట వస్తోంది. సరే నిన్న ఆఫీస్ లో పని వత్తిడి తక్కువ వుండటం వల్ల నా ఆలోచనలు ఎండమీదకి మళ్ళాయి. అసలు ఇంత ఎండలు రావటానికి కారణం ఏంటి అని ఆలోచించటం మొదలుపెట్టాను.
నా ఆలోచనలలో తెలిందేంటి అంటే ఇంత ఎండ ఉండటానికి కారణం మనందరి స్వార్ధం...కేవలం మన స్వార్ధం మాత్రమే..దేవుడు మనకి బుర్రని ఇచ్చాడు అని మురిసిపోయే మనిషి కి దాని తో పాటు తనకి గంపెడు స్వార్ధం కూడా వుంది అని గుర్తించటానికి ఇష్టపడడు...
ఇంతకీ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే నేను ఒక గంట బుర్ర గోక్కుంటే నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ఈ వేడికి కారణం మనమే హైదరాబాదు వాసులం.. వున్నా అన్ని కొండలని బండాలని పగలకొట్టి...చెట్లన్నీ తెగనరికి బహుళ అంతస్తుల మేడలు కడతాము..వాటిని కొనటానికి మనం మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గాడిద చాకిరికి కూడా సిద్దమవుతాం(ఈ ఎం ఐ కట్టాలికదా )..ఇదంతా నేను తప్పు అనట్లేదు కాని ఇక్కడ ఒక చిన్న నష్టాన్ని మనం గుర్తించట్లేదు మనం ప్రకృతికి నష్టం చేస్తున్నాం కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయటం మన కనీస బాధ్యత అది మరచిపోతున్నాం..
దీనివల్ల మనం విపరీతమైన ఎండలు మాత్రమే కాదు మన భావితరాలను కూడా భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం.. చెట్లు లేక పోవటం వల్ల భూగర్భ జలాలు ఇక్కడ ఉండట్లేదు దాని వల్ల మన మనకి నీటి ఎద్దడి ఏర్పడుతోంది ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి హైదరాబాదు మరో ఎడారిలాగా తయారు అవుతుంది.
ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం మనం పెద్ద పెద్ద తోటలు పెంచానవసరం లేదు. ప్రతి ఒకళ్ళు వారి ఇళ్ళలో ఒక చెట్టు నాటితే చాలు మళ్ళి నీటి ఎద్దడి విపరీతమైన ఎండలు ఉండనే ఉండవు..
కొన్ని సలహాలు:
1 . ఇండిపెండెంట్ ఇల్లు కలవారు మీ ఇంటి వాకిట్లో కాని దొడ్లోకాని ఒక వేప చెట్టు పెంచండి దీని వల్ల మీకు చాలా లాబాలు వుంటాయి
లాభాలు:
అ. వేపచెట్టు గాలి చాలా రోగాలను దూరం గా ఉంచుతుంది..దీని వల్ల మీకు ఆసుపత్రి బిల్లు ఆదా అవుతుంది
ఆ. చల్ల గాలి వీస్తుంది విద్యుత్ కోత సమయం లో దీని కింద పడుకుంటే మీకు ఎ.సి దండగ అనిపిస్తుంది
ఇ. వీప చెట్టుకు ఎన్నో మూలికా విలువలు వున్నాయి చాలా దెబ్బలని నయం చేయగల శక్తీ వుంది
ఈ. ఇక ఉగాదికి మీరు వ్యాపారం పెట్టచ్చు అని నేను ప్రఎకంగా చెప్పకర్లేదు అనుకుంటా:)
ఉ. పెద్దపెద్ద వేళ్ళు ఉండవు కాబట్టి పునాదులు పాడుఅవ్వవు
నష్టాలు:
అ. ఊడవటం కష్టం గా వుంటుంది చాలా ఆకులు రాలుతుంటాయి
2 . అపార్టుమెంట్ కలవారు వారి సంఘానికి చెప్పి వేపచెట్లు నాటించవచ్చు.
౩.అద్దె ఇంటిలో వుండే వారు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు వాటిని ఇల్లుమారే సమయంలో మార్చటం తేలికగా వుంటుంది.
ఈ చెట్లు పెంచటానికి మీరు పడాల్సిన శ్రమ పెద్దగ ఏమి వుండదు.. రోజు మీరు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఒక సారి దానికి నీరు పోస్తే సరిపోతుంది..చాలా వరకు వేపకి తెగులు రాదు కాని ఏమైనా వస్తే ఒక రోజు పురుగు మాడు కొట్టాలి అంతే...
మీరు చేసే ఈ చిన్న పని మీ పిల్లల భవిష్యత్తుని మార్చగలదు..నేను చెప్పను అని కాదు మీరే ఆలోచించుకోండి...మీరు మొక్కలు నాటతారు అని ఆశిస్తూ సెలవ్...
మీ నేస్తం

Subscribe to:
Posts (Atom)